Site icon NTV Telugu

UK: రష్యా, ఇరాన్ దేశాలపై యూకే కొత్త ఆంక్షలు..

Us Sanctions On Russia

Us Sanctions On Russia

UK Announces New Sanctions Against Russia, Iran: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తీరును తప్పపడుతున్నాయి వెస్ట్రన్ దేశాలు. ఇప్పటికే రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికాతో పాటు పలు వెస్ట్రన్ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. ఇటీవల రష్యా ఆయిల్ కొనుగోలుపై ప్రైజ్ క్యాప్ విధించాయి. ఈ ప్రైజ్ క్యాప్ తో బ్యారెల్ చమురును కేవలం 60 డాలర్లకు మాత్రమే కొనుగోలు చేయాలి. కాదని మరే దేశమైనా అంతకుమించి ధర చెల్లించి కొనుగోలు చేస్తే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాల ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇటీవల ఈయూ, జీ7 దేశాలు హెచ్చరించాయి. రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చమురు మీద వచ్చే ఆదాయాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Read Also: Anti-rape Footwear: అత్యాచార నిరోధక ఫుట్‌వేర్‌ని రూపొందించిన కర్ణాటక విద్యార్థిని

ఇదిలా ఉంటే తాజాగా యూకే మరోసారి ఆంక్షల ఆస్త్రాన్ని సంధించింది. కొత్తగా మరికొన్ని ఆంక్షలను రష్యా, రష్యాకు సహాయం చేస్తున్న ఇరాన్ దేశాలపై విధించింది. ఉక్రెయిన్ లక్ష్యంగా డోన్లను ఉత్పత్తి చేస్తున్న ఇరానియన్లతో పాటు రష్యా సీనియర్ సైనిక కమాండర్లపై బ్రిటన్ మంగళవారం కొత్తగా ఆంక్షలు ప్రకటించింది. క్రూయిజ్ క్షిపణులను లక్ష్యంగా చేసుకునే యూనిట్ ప్రోగ్రామింగ్ కు బాధ్యత వహిస్తున్న మేజర్ జనరల్ రాబర్ట్ బరనోవ్ తో సహా 12 మంది రష్యన్ ఉన్నతాధికారులకు చెందిన ఆస్తులను స్తంభింపచేయడంతో పాటు ట్రావెల్ బ్యాన్ విధించింది.

ఫారిన్ కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్(ఎఫ్సీడీఓ) ప్రకారం రష్యా క్షిపణి, ఫిరంగి దాడుల వల్ల 6 వేల మంది ఉక్రెయిన్లు మరణించినట్లు భావిస్తోంది. ఇది మానవహక్కులను ఉల్లంఘించడమే అని యూకే వాదిస్తోంది. రష్యాకు ఇరాన్ డ్రోన్లను సరఫరా చేయడంపై ఎఫ్సీడీఓ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యూకే విదేశాంగ కార్యదర్శి జెమ్స్ క్లావర్లీ మాట్లాడుతూ.. ఇరాన్ స్వదేశంలో పౌర నిరసనలతో దెబ్బతిందని.. మనుగడ ప్రయత్నాల్లో భాగంగానే రష్యాతో ఒప్పందాలు కుదుర్చుకుంటోందని ఆరోపించారు. యూకే తాజా ఆంక్షల్లో నలుగురు ఇరాన్ దేశస్తులు కూడా ఉన్నారు. రష్యాకు విక్రయిస్తున్న కామికేజ్ డ్రోన్ల ఇంజిన్ తయారీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

Exit mobile version