కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి విజృంభిస్తుండటంతో వివిధ దేశాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాలపై ట్రావెల్ బ్యాన్ ను విధిస్తున్నాయి. తాజాగా గల్ప్ దేశమైన యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సహా 14 దేశాలకు చెందిన ప్రయాణికులపై నిషేదం విధించింది. ఈ నిషేదం జులై 21 వరకు అమలులో ఉండబోతున్నది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకతో పాటుగా ఆఫ్రికాలోని వివిధ దేశాలపై కూడా యూఏఈ నిషేదం విధించింది. కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యుఏఈ సివిల్ ఏవియోషన్ అధారిటి తెలియజేసింది. అయితే, కార్గో, చార్టెడ్ విమానాలకు ఈ నిషేదం వర్తించదని తెలియజేసింది.
యూఏఈ కీలక నిర్ణయంః భారత్‌తో సహా 14 దేశాలపై నిషేదం…
