UAE: “మీ యుద్ధం మాతో కాదు, తెలివిలోకి రండి”.. ఇరాన్‌పై యూఏఈ ఆగ్రహం..
UAE: అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా ఖమేనీ హతమయ్యారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రోరింగ్ లయన్’’ కొనసాగిస్తోంది. ఇప్పటికే ఇరాన్ టాప్ సైనిక నాయకత్వాన్ని నాశనం చేసినట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఇరాన్ తన ప్రతీకార దాడుల్ని అమెరికా మిత్రదేశాలపై కొనసాగిస్తోంది. యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రైయిన్, ఒమన్, సౌదీ అరేబియాలపై దాడులు చేసింది. ముఖ్యంగా యూఏఈలోని దుబాయ్, అబుదాబి పై దాడులు చేసింది. ఎయిర్‌పోర్టులు, లగ్జరీ హోటళ్లపై ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్ అటాక్స్ చేసింది.
Read Also: Israel-Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు, టెహ్రాన్‌పై బాంబుల వర్షం..
Also Read
- RBI Gold Reserves: భారత్‌కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
- Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
ఇదిలా ఉంటే, ఇరాన్ దాడులపై యూఏఈ స్పందించింది. ‘‘పొరుగు దేశాలపై దాడులు ఎందుకు చేస్తున్నారు. మీ యుద్ధం పొరుగు దేశాలతో కాదు’’ అని యూఏఈ (UAE) అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హెచ్చరించారు. యూఏఈ వంటి పొరుగు దేశాలు యుద్ధంలో లేనందున ఇరాన్ తెలివిగా వ్యవహరించాలని అని యూఏఈ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ తన బాధ్యతారహిత్యమైన చర్యలతో ఒంటరైపోతోందని పేర్కొన్నారు. ‘‘ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దురాక్రమన ఒక తప్పుడు లెక్క’’ అని యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్ అన్నారు.
శనివారం అబుదాబీలోని అల్-దఫ్రా అమెరికన్ బేస్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఇదే కాకుండా దుబాయ్‌లోని ఐదు ప్రాంతాలపై ఇరాన్ అటాక్ చేసింది. యూఏఈ మాత్రమే కాకుండా ఖతార్ రాజధాని దోహాపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. బహ్రైయిన్ మనామాను కూడా ఇరాన్ వదల్లేదు.
తాజావార్తలు
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!