Govt Shutdown: షట్‌డౌన్ ప్రమాదం నుంచి అగ్రరాజ్యం అమెరికా గట్టెక్కినట్లే కనబడుతుంది. డొనాల్డ్ ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ లాస్ట్ మినిట్ లో ఆమోదించింది. శుక్రవారం సాయంత్రం ( యూఎస్ కాలమానం ప్రకారం) స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశ పెట్టిన కొత్త ప్రణాళిక బిల్లుకు ప్రతినిధుల సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ట్రంప్ లేవనెత్తిన డిమాండ్లను ఈ ప్రణాళిక నుంచి తొలగించింది. ఆ తర్వాత ఈ బిల్లును సెనెట్‌కు పంపగా.. అక్కడ కూడా ఆమోదం పొందితే అమెరికా షట్‌డౌన్ ముప్పు నుంచి తప్పించుకుంటుంది.
Read Also: Canada: ట్రూడోకు జగ్మీత్‌సింగ్ షాక్.. లిబరల్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం!
కాగా, సర్కార్ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా జో బైడెన్ కార్యవర్గం ఈ బిల్లును తెచ్చింది. దీన్ని తొలుత ట్రంప్ వ్యతిరేకించారు. అలాగే, సమాఖ్య సర్కార్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతో పాటు వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ బిల్లులో రెండేళ్ల పాటు రుణాలపై పరిమితిని ఎత్తివేయాలని అతడు డిమాండ్ చేశారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను చేరుస్తూ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ గురువారం నాడు సరికొత్త బిల్లును ప్రవేశ పెట్టారు. కానీ, ఈ బిల్లుకు ప్రతినిధుల సభలో 235-174తో వీగిపోయింది. ఈ బిల్లుకు ఏకంగా 38 మంది రిపబ్లికన్ సభ్యులే డెమోక్రాట్లతో కలిసి వ్యతిరేకంగా ఓటు వేశారు.
Read Also: Hit And Run Accident: క్రిస్మస్ మార్కెట్‌లో ప్రజలపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి, 60 మందికి పైగా
అయితే, ఈ పరిణామాలపై వైట్ హౌస్ కూడా కీలక కామెంట్స్ చేసింది. షట్‌డౌన్ వస్తే అధికార మార్పిడికి అంతరాయం ఏర్పడుతుందని హెచ్చరించింది. దీంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గడంతో.. అతడు చేసిన డిమాండ్లను తొలగించిన తర్వాత సమాక్య కార్యకలాపాలకు నిధులు, విపత్తు సాయం వంటి అంశాలతో 118 పేజీల మరో కొత్త ప్యాకేజీ బిల్లును స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశ పెట్టగా.. 366-34తో ప్రతినిధుల సభ ఆమోదించింది. మెజార్టీ రిపబ్లికన్లు ఈ కొత్త బిల్లుకు మద్దతుగా ఓటేశారు. ఆ తర్వాత దీన్ని సెనెట్‌కు పంపించారు. ప్రస్తుతం సెనెట్‌లో డెమోక్రాటిక్ పార్టీ వారే ఆధిక్యంలో ఉండటంతో.. అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే.