Site icon NTV Telugu

Pakistan: పాకిస్థాన్‌లో దారుణం.. ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం

Rape

Rape

పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల బహవల్‌నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాళ్ల వయసు వరుసగా 16, 17 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. జూన్ 5వ తేదీన జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బహిర్భూమికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన అక్కాచెల్లెళ్లను తుపాకీతో బెదిరించి ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులు ఉమైర్ అష్ఫాక్, కాషిఫ్ అలీగా గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. ఇద్దరు బాలికలకు వైద్య పరీక్షలు చేయించగా.. అత్యాచారం జరిగినట్లు నిర్ధరణ అయిందని చెప్పారు.

North Korea: కిమ్‌ రాజ్యంలో విజృంభిస్తోన్న మరో అంటువ్యాధి..

నిందితుడు కాషిఫ్ అలీ ఆ ప్రాంతంలో పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందినవాడు. దీంతో బాధితుల కుటుంబంతో రాజీ కుదుర్చేందుకు కొందరు పలుకుబడి ఉన్న పెద్దలు కేసు నమోదు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో కేసు నమోదు చేయటలో మూడు రోజులు ఆలస్యం అయింది. అనంతరం బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరైన ఉమైర్‌ అష్పాక్‌ను అరెస్టు చేశారు. మరొక నిందితుడు కాషిఫ్ అలీ.. కోర్టు నుంచి ముందస్తు బెయిల్​ పొందాడని పోలీసులు తెలిపారు.

Exit mobile version