Site icon NTV Telugu

Russia: ఒకే రోజు పుతిన్ సన్నిహితులు ఇద్దరు మృతి..

Russia

Russia

Russia: ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత పలువురు అధికారులు, పుతిన్ కు సన్నిహితులు, ఆయన్ను వ్యతిరేకించిన వారు వరసగా అనుమానాస్పద మరణాలకు గురువుతున్నారు. తాజాగా పుతిన్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు ఒకే రోజు మరణించడం చర్చనీయాంశం అయింది. అధికార యునైటెడ్ రష్యా పార్టీకి చెందిన స్టేట్ డూమా డిప్యూటీలుగా పనిచేస్తున్న ఇద్దరు రష్యన్ అధికారులు ఆదివారం మరణించారని న్యూస్ వీక్ నివేదించింది.

Read Also: Virat Kohli: డేంజర్ జోన్‌లో కోహ్లీ.. మళ్లీ రిపీటైతే అంతే సంగతులు!

2003 నుంచి స్టేట్ డూమా డిప్యూటీగా పనిచేసిన 77 ఏళ్ల నికోలాయ్ బోర్ట్సోవ్, 57 ఏళ్ల ఝాషర్బెక్ ఉజ్డెనోవ్ ఒకే రోజు మరణించారు. ఉజ్డెనోవ్ తీవ్ర అనారోగ్యంతో మరణించగా.. బోర్ట్సోవ్ ఆదివారం లిపెట్స్క్ ప్రాంతంలోని తన ఇంటిలో మరణించాడు. అయితే ఇతని మరణానికి కారణాలు తెలియరాలేదు. ఫిబ్రవరి 2022లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి అనేక మంది ప్రముఖ రష్యన్‌లు అనూహ్య పరిస్థితుల్లో మరణించారు. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి . పుతిన్‌తో సంబంధం ఉన్న కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తులతో సహా కనీసం 20 మంది రష్యన్లు రహస్య పరిస్థితుల్లో మరణించారు.

ఉక్రెయిన్ తో యుద్ధ ప్రారంభం అయిన తర్వాత నికోలాయ్ బోర్ట్సోవ్ అమెరికా, పాశ్చాత్య దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. దాదాపుగా ఇతను 550 మిలియన్ డాలర్ల సంపదతో రష్యాలో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా ఉన్నారు. 2021లో ఫోర్బ్స్ రష్యా సంపన్నుల జాబితాలొో టాప్ 100లో చోటు దక్కించుకున్నాడు. ఝాషర్బెక్ ఉజ్డెనోవ్ పర్యావరణ శాస్త్రం, సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణపై రష్యా హౌస్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. యుద్ధం ప్రారంభం అయిన తర్వాత ఇతను కూడా న్యూజీలాండ్ ఆంక్షల కిందికి వచ్చాడు.

Exit mobile version