F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
- వైమానిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం
- ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు
- రెండు అమెరికన్ EA-18G గ్రోలర్ యుద్ధ విమానాలు గాలిలో ఢీకొన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగిన వైమానిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు అమెరికన్ EA-18G గ్రోలర్ యుద్ధ విమానాలు గాలిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి కుప్పకూలిపోయాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన మధ్యాహ్నం 12:30 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) ప్రాంతంలో జరిగింది.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో యుద్ధ విమానాలు ఢీకొన్న వెంటనే అప్రమత్తమైన పైలట్స్ పారాచూట్స్ సాయంతో కిందకు దూకారు. ఇడాహో స్టేట్స్‌మ్యాన్ కథనం ప్రకారం, నలుగురు సిబ్బంది (పైలట్లు) సురక్షితంగా బయటకు దూకారని, వారు పూర్తిగా క్షేమంగా ఉన్నారని ఆ షో అనౌన్సర్ ప్రేక్షకులకు తెలియజేశారు.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో చిక్కుకున్న విమానాలు యూఎస్ నేవీ/ఎయిర్ ఫోర్స్ ఉపయోగించే రెండు EA-18G గ్రోలర్ ఫైటర్ జెట్లు. ఇవి F-18 హార్నెట్‌కు చెందిన ఒక అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వేరియంట్. ఎయిర్‌బేస్‌కు సుమారు రెండు మైళ్ల దూరంలో ఈ రెండు జెట్లు కూలిపోయాయని అధికారులు తెలిపారు. మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రతినిధి మాట్లాడుతూ, దర్యాప్తు బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని తెలిపారు.
BREAKING: 2 U.S. Navy Super Hornets/Growlers crash and collide during Gunfighter Skies Air Show at Mountain Home Air Force Base in Idaho.
Aviation sources tell KTVB that both aircrews ejected safely. pic.twitter.com/GPsdrwTFWq
— Open Source Intel (@Osint613) May 17, 2026
తాజావార్తలు
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..