NTV Telugu Site icon

Twitter: చిక్కుల్లో ఎలాన్ మస్క్.. కోర్టులో పిటిషన్.. కారణం ఇదే..

Elon Musk

Elon Musk

Twitter sued for mass layoffs by Elon Musk without enough notice: ట్విట్టర్‌ను భారీ డీల్‌తో కొనుగోలు చేశారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. 44 బిలియన్ డాలర్ల వ్యయంతో ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకున్నారు. ట్విట్టర్ సొంత చేసుకున్నప్పటి నుంచి తన మార్క్ చూపిస్తున్నారు మస్క్. వచ్చీ రావడంతో సీఈఓ పరాగ్ అగర్వాల్ తో పాటు మరో ముగ్గురు కీలక ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. దీంతో పాటు ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైెరెక్టర్ రద్దు చేసి తానే ఎకైక డైరెక్టర్ గా మారారు. ట్విట్టర్ ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు మస్క్.

ఇదిలా ఉంటే తన ట్విట్టర్ నుంచ ఏకంగా సగం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవుతున్నారు ఎలాన్ మస్క్. శుక్రవారం ఉదయం నుంచి పలువురు ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. కంపెనీలో పనిచేస్తున్న 3700 మంది ఉద్యోగులను తొలగించాలని మస్క్ ప్లాన్. ఖర్చులను తగ్గించుకునేందుకే ఈ చర్యను చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంపై ఎలాన్ మస్క్ ప్రస్తుతం చిక్కులు ఎదుర్కోబోతున్నారు. అయితే సరైన నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని.. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ ఉద్యోగుల్ని తొలగించే ప్రణాళికపై శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో గురువారం క్లాస్- యాక్షన్ పిటిషన్ దాఖలు అయింది.

Read Also: Delhi Pollution: కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి.. స్కూళ్ల మూసివేత.. 4 రాష్ట్రాలకు ఎన్‌హెచ్ఆర్ నోటీసులు

ఫెడరల్ వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ యాక్ట్ ప్రకారం కనీసం 60 రోజుల ముందస్తు నోటీసులు లేకుండా ఉద్యోగాలను తొలగించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. చట్టాలకు కట్టుబడి ఉండాలని ట్విట్టర్ ను ఆదేశించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది షానన్ లిస్ రియోర్డాన్. జూన్ లో టెస్లా కంపెనీలో 10 శాతం ఉద్యోగులను తొలగించినప్పుడు కూడా ఇలాంటి పిటిషనే దాఖలైంది. ఇప్పటికే ట్విట్టర్ లో బ్లూ టిక్ ఉంటే నెలకు 8 డాలర్లు చెల్లించాలని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. దీంతో పాటు తన కంపెనీలు అయిన టెస్లా, న్యూరాలింక్ నుంచి ఉద్యోగులను ట్విట్టర్ లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Show comments