NTV Telugu Site icon

Twitter CEO Parag Agarwal: ట్విట్టర్‌లో కీలక పరిణామం.. సీఈవో ఔట్

Ceo Twiter

Ceo Twiter

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా? ఎలాన్ మస్క్ తన ప్రభావం చూపిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది.ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ త్వరలో పదవి నుంచి వైదొలగనున్నట్టు తెలుస్తోంది. సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ సీఈవోకి ఉద్వాసన పలుకుతున్నారనే వార్తలు వస్తున్నాయి. టెస్లా సీఈవోగా ఉన్న ఎలన్ మస్క్ త్వరలో ట్విట్టర్ బాధ్యతలనూ చూసుకుంటారని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం 4,400 కోట్ల డాలర్లకు ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేశారు. అప్పటినుంచి సీఋవో పరాగ్ అగర్వాల్ ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే పరాగ్ ను మస్క్ తొలగించనున్నట్టు సంస్థ వర్గాలు, పలు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. కొత్త సీఈవోను రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఆ కొత్త సీఈవో వచ్చే వరకు కొన్ని రోజుల పాటు ట్విట్టర్ కు తాత్కాలిక సీఈవోగా ఎలాన్ మస్క్ బాధ్యతలు నిర్వర్తించే అవకాశం వుంది. పరాగ్ ను తొలగిస్తే ఆయనకు 4.3 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలి. ఇటు మరో ఇండియన్ ఎగ్జిక్యూటివ్, కంపెనీకి లీగల్ హెడ్ అయిన విజయ గద్దెనూ ఆయన తొలగించే అవకాశాలున్నట్టు సమాచారం. ఆమెకూ 1.25 కోట్ల డాలర్ల మేర పరిహారం ఇవ్వాలి. ట్విట్టర్ మస్క్ కొన్నాక తమ భవిష్యత్ పై ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. తన సంస్థలో ఉద్యోగ భద్రత లేదనుకునేవాళ్లు వెళ్లిపోయినా తనకేమీ అభ్యంతరం లేదన్నారు ఎలాన్ మస్క్. ఈ నేపథ్యంలో త్వరలో పరాగ్ ట్విట్టర్ నుంచి వెళ్ళిపోవచ్చని అంటున్నారు.

Twitter: షాకింగ్.. ఎలన్ మస్క్ ఫాలోవర్లలో సగం మంది ఫేక్