Turkey On Kashmir: టర్కీ బుద్ధి వంకర.. యూఎన్‌లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ఎర్డోగాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey On Kashmir: ఎన్నిసార్లు భారత్ చెబుతున్నా పాకిస్తాన్ మిత్రదేశం టర్కీ తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తాడు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెషన్‌లోని అత్యున్నత స్థాయి 78వ సెషన్లో ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాడు. దక్షిణాసియాలో ప్రాంతీయ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు ఉండాలంటే భారత్, పాకిస్థాన్ దేశాలు చర్చలు, సహకారం ద్వారా కాశ్మీర్ లో న్యాయమైన, శాశ్వతమైన శాంతనిి నెలకొల్పాలి అని అన్నారు.
Read Also: India vs Canada: కెనడా వివాదం.. మంత్రి జైశంకర్‌తో ప్రధాని మోడీ భేటీ..
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఇరు దేశల మధ్య చర్చలకు టర్కీ మద్దతు ఇస్తూనే ఉంటుందని ఎర్డొగాన్ తెలిపారు. జీ20 సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీలో చర్చించిన కొన్ని రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమని ఎర్డొగాన్ అన్నారు. భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలతో పాటు 15 తాత్కాలిక సభ్యదేశాలను, శాశ్వత సభ్యదేశాలుగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ 20 సభ్యదేశాలు రొటేషన్ లో శాశ్వత సభ్యదేశాలుగా ఉండాలని, అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ కన్నా ప్రపంచం చాలా పెద్దదని ఆయన వ్యాఖ్యానించారు.
టర్కీ ఇలా కాశ్మీర్ అంశాన్ని యూఎన్ లో లేవనెత్తడం ఇది మొదటిసారి కాదు. పలు సందర్బాల్లో పాకిస్తాన్ కి వత్తాసు పలికింది. ఇరుదేశాలకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా కాశ్మీర్ సమస్య పరిస్కారం కాకపోవడం దురదృష్టకరమని ఎర్డొగాన్ తాజాగా వ్యాఖ్యానించారు. అయితే కాశ్మీర్ భారత అంతర్గత విషయమని మనదేశం పలుమార్లు టర్కీ వ్యాఖ్యాల్ని తిప్పికొట్టింది. కాశ్మీర్ సమస్యను లేవనెత్తితే తాము సైప్రస్ సమస్యను లెవనెత్తుతామని భారత్ పలు సందర్భాల్లో టర్కీకి చెప్పకనే చెప్పింది.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!