NTV Telugu Site icon

Turkey: టర్కీ అధ్యక్షుడు నిర్వాకం.. ముద్దు పెట్టనందుకు చెంపదెబ్బ

Turkishpresidenterdogan

Turkishpresidenterdogan

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రవర్తన వివాదాస్పదమైంది. వేదికపై ఓ చిన్నారిని చెంపదెబ్బ కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..

జూలై 27న రైజ్ ప్రావిన్స్‌లో టర్కీ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇనిషియేటివ్ కింద ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన సందర్భంగా ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేదికపైకి ఇద్దరు చిన్నారులను ఆహ్వానించారు. సంప్రదాయం ప్రకారం ముద్దుల కోసం అధ్యక్షుడు తన చేతిని ఇచ్చారు. కానీ బాలుడు మాత్రం ముద్దు ఇవ్వడానికి సంకోచించాడు. అంతే చిన్నారి చెంపపై ఎర్డోగాన్ ఒక్కటిచ్చారు. అక్కడే ఉన్న సిబ్బంది.. ఆ బాలుడికి ముద్దు పెట్టుకోమని చెప్పగా.. ఆ తర్వాత వెళ్లి హగ్ చేసుకున్నాడు. ఇంకో బాలుడు మాత్రం ముద్దు ఇచ్చి.. హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: Buddy: అల్లు శిరీష్”బడ్డీ” సినిమాకి స్పెషల్ ఆఫర్

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది సరైన ప్రవర్తన కాదని తప్పుబడుతున్నారు. ఇంకొందరు ఆయన తీరును సమర్థిస్తున్నారు. ఎర్డోగాన్‌కు ఈ ఘటన ఇదే మొదటిసారి కాదు. గతేడాది కూడా ఇదే తరహాలో మనవడిని చెప్పుతో కొట్టడం వివాదానికి దారి తీసింది.