Site icon NTV Telugu

IndiaPakWar: టర్కీ డబుల్ గేమ్.. పాక్కి డ్రోన్ల సరఫరా.. పహల్గామ్ మృతులకు సంతాపం

Turky

Turky

IndiaPakWar: టర్కీ దేశం డబుల్ గేమ్ ఆడుతుంది. చేసిన సాయానికి కృతజ్ఞత చూపించకుండా భారత్ పై విషం కక్కుతుంది. 2023లో ఆ దేశంలో భారీ భూకంపం వచ్చినప్పుడు సాయం ప్రకటించిన తొలి దేశం ఇండియానే. ‘ఆపరేషన్‌ దోస్త్‌’ పేరిట భారీగా మానవతా సాయాన్ని అందజేసింది. బాధితులకు ఆహారం, మెడిసిన్ సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్‌ డ్రోన్లను మోడీ సర్కార్ పంపింది. అప్పుడు మనం మానవత్వాన్ని చూపిస్తే.. ఇప్పుడు భారత్‌పై దాడికి పాకిస్థాన్‌కు డ్రోన్లను పంపిస్తుంది టర్కీ.

Read Also: India Pak War : భారత సైనిక చర్యతో ఎమర్జెన్సీ భేటీకి షాబాజ్ షరీఫ్ పిలుపు..!

అయితే, గురువారం నాడు పాకిస్తాన్ భారీస్థాయిలో భారత్‌పై డ్రోన్లతో దాడులు చేసింది. దాదాపు 300- 400 డ్రోన్లను ప్రయోగించగా.. వాటిని ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. కాగా, ఆ శకలాలను ఫోరెన్సిక్‌ నిపుణులు పరీక్షించగా.. అవన్నీ టర్కీకి చెందిన అసిస్‌ గార్డ్‌ సోనగర్‌’ డ్రోన్లుగా తేలింది. ఇక, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు మొదటి నుంచి భారత్‌ పై విపరీతమైన ద్వేషం ఉంది. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో అతడు బహిరంగంగా తెలియజేశాడు. పహల్గాం దాడి జరిగిన తర్వాత ప్రపంచ దేశాలు ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తుంటే.. టర్కీ అధినేత మాత్రం పాక్‌ ప్రధానితో కలిశారు. ఆ దేశానికి మద్దతు పలికారు.

Read Also: Rajnath Singh: పాకిస్తాన్ తాట తీయాల్సిందే.. సైన్యానికి కీలక ఆదేశాలు

ఇక, పహల్గాం ఉగ్రదాడి జరగగానే పాకిస్తాన్‌పై భారత్‌ దాడి చేస్తుందని ముందుగానే ఊహించిన టర్కీ.. ఆరు సైనిక విమానాల్లో పాక్‌కు ఆయుధాలను పంపించింది ఎర్డోగాన్‌ సర్కార్. టర్కీ సీ-130ఈ హెర్క్యూలస్‌ విమానం గత నెల 28వ తేదీన ఇస్లామాబాద్ లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు తెలిపాయి. అయితే, ఇంధనం నింపుకోవడానికి తమ యుద్ధ విమానం దిగిందని అబద్దపు మాటలు చెప్పింది టర్కీ. తర్వాత ఓ యుద్ధ నౌకను కూడా కరాచీ నౌకాశ్రయానికి పంపింది. ఇప్పుడు ఆ ఆయుధాలనే భారత్‌పై దాయాది దేశం ప్రయోగిస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత టర్కీ, అజర్‌ బైజాన్‌ మాత్రమే పాక్‌కు మద్దతిస్తూ వెల్లడించాయి. అయితే, తాజాగా, పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన మృతులకు టర్కీ సంతాపం ప్రకటించింది. దీంతో టర్కీ అధినేత డబుల్ గేమ్ పై భారత్ ఇంకా స్పందించలేదు.

Exit mobile version