Site icon NTV Telugu

Donald Trump: కోర్టు ఉద్యోగిపై ట్రంప్‌ ఆరోపణలు.. స్పందించిన న్యాయమూర్తి

Untitled 13

Untitled 13

US: రోజు రోజుకి ట్రంప్‌ సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. తాజాగా మంగళవారం ట్రంప్‌ సివిల్ వ్యాపారం పైన న్యూయార్క్ న్యాయమూర్తి నిషేధాజ్ఞలు జారీ చేశారు. వివరాలలోకి వెళ్తే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా జడ్జి అంగోరోన్ చీఫ్ క్లర్క్ అల్లిసన్ గ్రీన్‌ఫీల్డ్‌పై ఆరోపణలు చేసారు. సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమెర్, D-N.Yతో గ్రీన్‌ఫీల్డ్ ఫోటోను షేర్ చేసిన ట్రంప్.. ఫోటో పబ్లిక్ ఈవెంట్.. ఇది అవమానకరమని ట్రంప్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ కారణంగా ట్రంప్ పైన కేసు నమోదైంది. కాగా ఈ కేసును విచారించిన న్యూయార్క్ న్యాయమూర్తి ట్రంప్ సివిల్ వ్యాపారంపై పరిమిత నిషేధాజ్ఞలు జారీ చేశారు.

Read also:Bus accident :వంతెనపై నుంచి పడిన బస్సు.. 21 మంది మృతి

వాంగ్మూలం తర్వాత, న్యాయమూర్తి ఆర్థర్ అంగోరాన్ ఈ ఉత్తర్వును జారీ చేశారని విదేశీ మీడియా నివేదికల సమాచారం. కాగా ఈ కేసు పైన స్పందించిన ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తనపైన ఈ కేసుని పెట్టారని.. ఇది రాజకీయ కుట్రని పేర్కొన్నారు. కేసు విచారణలో భాగంగా కోర్టుకి హాజరు కావడంతో తాను ప్రచారం చేయలేకపోయానని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనని ప్రచారానికి రాకుండా అడ్డుకుని ప్రత్యర్ధులు వాళ్ల వ్యూహాన్ని విజయవంతం చేసుకున్నారని.. నన్ను ప్రజలలోకి రానివ్వకుండా ప్రచారం చెయ్యనియ్యకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version