Donald Trump: అమెరికా సుప్రీంకోర్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారీ విజయం లభించింది. వ్యక్తిగతంగా న్యాయమూర్తులు ట్రంప్ అధికారాలను కట్టడి చేయడాన్ని సుప్రీంకోర్టు పరిమితం చేసింది. జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేయాలనే ట్రంప్ ప్రయత్నంపై 6-3తో తీర్పు ఇచ్చింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తులు దేశవ్యాప్తంగా జారీ చేసిన నిషేధాలు చట్ట సభలు కోర్టులకు ఇచ్చిన అధికారాలను మించిపోయేలా ఉందని కోర్టు పేర్కొంది.
Read Also: Kubera vs Kannappa : కుబేరపై కన్నప్ప ఎఫెక్ట్ పడుతుందా..?
అమెరికన్ గడ్డపై పుట్టిన ప్రతీ వ్యక్తికి ఆటోమెటిక్‌గా పౌరసత్వాన్ని రద్దు చేయాలని ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు రాజ్యాంగబద్ధతపై అత్యున్నత న్యాయస్థానం వెంటనే తీర్పు ఇవ్వలేదు. అయితే, జన్మతా వచ్చే పౌరసత్వాన్ని నిరోధించే ట్రంప్ ఉత్తర్వులనున ఆపాలని 22 రాష్ట్రాలు దావా వేశాయి. అయితే, దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వలసదారుల పౌరసత్వ దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండించింది.
ఈ తీర్పును ‘‘అతిపెద్ద విజయం’’గా ట్రంప్ కొనియాడారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వ మోసాన్ని ఈ తీర్పు పరోక్షంగా దెబ్బతీసిందని అన్నారు. అమెరికన్ అధ్యక్షులను నియంత్రించే న్యాయవ్యవస్థ సామర్థ్యంపై ఈ తీర్పు చాలా ప్రభావాన్ని కలిగి ఉంది. అటార్నీ జనరల్ పామ్ బాండీ, సాలిసిటర్ జాన్ సౌర్‌కు ట్రంప్ అభినందనలు తెలియజేశారు. ఈ విజయాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ విజయంగా భావిస్తున్నారు. జన్మతా పౌరసత్వంపై ట్రంప్ మాట్లాడుతూ. ‘‘ఇది దాస్యుల పిల్లల విషయానికి సంబంధించింది, వలసదారుల స్కామ్ కాదు’’ అని అన్నారు.
