Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- యూఎన్ వేదికగా ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం
- ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తామంటూ ప్రపంచ నేతల ముందు టెహ్రాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ కీలక ప్రసంగం చేశారు.
‘‘వారికి బతికే అవకాశం లేకుండా, భవిష్యత్తు వైభవం లేదా తరాలపై ఆశ లేకుండా నేను వారిని నరకంలోకి నెట్టేస్తానా?’’ అని అన్నారు. నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఒక ఇరాన్‌తో ఒప్పందం సాధ్యమవుతుందని తాను నమ్ముతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
- India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
- US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల్లో ఇరాన్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. గత 51 ఏళ్లుగా ఇరాన్ ఛాందసవాద ప్రభుత్వం రక్తపాతం, హత్యల ద్వారా పరిపాలిస్తోందని పేర్కొన్నారు. ఇరాన్ మధ్యప్రాచ్యం అంతటా.. దాని వెలుపల కూడా మరణం, విధ్వంసం, గందరగోళాన్ని సృష్టించిందన్నారు. ఒకప్పుడు ఇరాన్ మధ్యప్రాచ్యాన్ని బెదిరించేదని.. కానీ ఇప్పుడు అలా చేయడం దానికి సాధ్యం కాదని పేర్కొన్నారు. ఇరాన్ ఇకపై పెత్తందారు కాదని.. టెహ్రాన్‌కు అణ్వాయుధం సమకూర్చడానికి ఎప్పటికీ అనుమతించబోమని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఇరాన్‌తో సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. సమావేశం ఇంకా ఖరారు కానప్పటికీ ట్రంప్ మాత్రం హెచ్చరిక జారీ చేశారు. ఇదిలా ఉంటే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు మంగళవారం బయలుదేరి వెళ్లారు. బుధవారం సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. ఫిబ్రవరి చివరిలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన మధ్యప్రాచ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా గడ్డపై అడుగుపెట్టనున్న అత్యున్నత స్థాయి ఇరాన్ అధికారి పెజెష్కియన్ కానున్నారు.
ఇక ట్రంప్ బుధవారమే న్యూయార్క్ నుంచి బయల్దేరి వైట్‌హౌస్‌కు వెళ్లనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు స్వాగతం పలకనున్నారు. అంతేకాకుండా ప్రత్యేక విందు కూడా ఇవ్వనున్నారు. అలాగే తాను టెహ్రాన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నానని కూడా ట్రంప్ చెప్పారు.
తాజావార్తలు
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!