Site icon NTV Telugu

Trump: అదనంగా 10 శాతం సుంకాలు వసూలు చేస్తాం.. బ్రిక్స్‌ దేశాలకు ట్రంప్ వార్నింగ్

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. బ్రిక్స్‌తో సంబంధాలు పెట్టుకున్న దేశాలకు 10 శాతం అదనంగా సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 2న ట్రంప్.. దేశాలపై సుంకాలు విధించారు. ఈ చర్యను బ్రిక్స్ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా పాలసీలు వ్యతిరేకిస్తున్న బ్రిక్స్ దేశాలకు అదనంగా మరో 10 శాతం సుంకాలు విధించబోతున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాలో స్పష్టం చేశారు. బ్రిక్స్‌తో సంబంధాలు పెట్టుకున్న ఏ దేశానికైనా ఇదే వర్తిస్తుందని.. మినహాయింపులు ఉండవని పేర్కొన్నారు. ఈ విషయంలో మీరు చూపిన శ్రద్ధకు ధన్యవాదాలు.’’ అంటూ పోస్టులో తెలిపారు.

ఇది కూడా చదవండి: Harihara Veeramallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ కి కొత్త టెన్షన్..

2009లో జరిగిన తొలి శిఖరాగ్ర సమావేశంలో బ్రిక్స్ గ్రూప్‌లో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా చేరాయి. అనంతరం దక్షిణాఫ్రికాను కలుపుకున్నారు. ఇక గత సంవత్సరం ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా కూడా సభ్యులుగా చేరాయి.

ఇది కూడా చదవండి: Mulugu: ములుగు జిల్లాలో మంత్రుల పర్యటన.. మరోవైపు నిరసనలతో ఉద్రిక్తత

ఏప్రిల్ 2న ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలు ప్రకటించారు. అనంతరం వ్యతిరేకత రావడంతో మూడు నెలల పాటు వాయిదా వేశారు. ఆ గడువు జూలై 9తో ముగుస్తుంది. ప్రస్తుతం యూకే, వియత్నాం, చైనా మాత్రమే అమెరితో ఒప్పందాలు చేసుకున్నాయి. మిగతా దేశాలు చేసుకోలేదు. ట్రంప్ విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. అయితే భారత్‌‌లో వ్యవసాయం. పారి పరిశ్రమలపై అమెరికా రాయితీలు కోరుతోంది. అయిదే ఇవే మన దేశానికి సెంటిమెంట్. ఈ నేపథ్యంలోనే భారత్ వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. రేపటిలోగా ఏదొక ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.

 

 

 

Exit mobile version