Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump Warning Iran Us Military Threat Hormuz Tensions Middle East

Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. మరోసారి ఉద్రిక్తతలు తప్పవా!?

Published Date :April 9, 2026 , 10:06 am
By Suresh Maddala
  • ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్
  • మరోసారి ఉద్రిక్తతలు తప్పవా!?
  • ఈసారి భారీ దాడులుంటాయని హెచ్చరిక
Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. మరోసారి ఉద్రిక్తతలు తప్పవా!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ తప్పదా? మళ్లీ యుద్ధానికి దేశాలు సై అంటున్నాయా? ఇజ్రాయెల్ దూకుడు. ఇరాన్ మెలిక. శాంతి ఒప్పందానికి ప్రతిష్టంభన ఏర్పడిందా? మళ్లీ మూడు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయా? అంటే సంకేతాలు అలానే అనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే.. మరోసారి మధ్యప్రాచ్యం రక్తసిక్తమయ్యేలా కనిపిస్తోంది.

బుధవారం ఇరాన్‌తో 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో శాంతి పరిమళిస్తుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడింది. వైమానిక దాడుల్లో దాదాపు 254 మంది చనిపోగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ వ్యవహారం ఇరాన్‌కు రుచించలేదు. అమెరికా, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని భీష్మించుకుని హార్ముజ్ జలసంధిని మళ్లీ దిగ్బంధించింది. రాకపోకలు నిలిపివేసింది. లెబనాన్‌పై దాడులు ఆపకపోతే శాంతి చర్చలు ఉండబోవని ఇరాన్ అంటోంది. అయితే ఒప్పందం విషయంలో ఇరాన్ పొరబడుతోందని.. ఒప్పందం కేవలం ఇరాన్‌తో మాత్రమేనని.. లెబనాన్‌తో కాదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తేల్చి చెప్పారు.

తాజాగా మరోసారి అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్‌కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి శాంతి ఒప్పందం కుదరకపోతే.. మునుపటి కంటే భీకరంగా దాడులు ఉంటాయని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అమెరికా నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది, అలాగే అదనపు ఆయుధ సామగ్రి అన్నీ అక్కడే కొనసాగుతాయని తెలిపారు. ఇప్పటికే బలహీనపడిన శత్రువును పూర్తిగా నిర్మూలించే వరకు ఈ మోహరింపు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. అసలైన ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసే వరకు అమెరికా వెనక్కి తగ్గదని ట్రంప్ స్పష్టం చేశారు. ఏదైనా కారణంతో ఒప్పందం అమలు కాకపోతే మాత్రం.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మరింత భారీ స్థాయిలో యుద్ధ చర్యలు ప్రారంభమవుతాయని హెచ్చరించారు.

ఇరాన్ దగ్గర ఏ మాత్రం అణ్వాయుధాలను కలిగి ఉండకూడదన్నది చాలా కాలం క్రితమే నిర్ణయించబడిందని.. అలాగే హార్ముజ్ జలసంధి ఎప్పటికీ తెరిచి, సురక్షితంగా ఉంచాలని పేర్కొన్నారు. ఇది గనుక జరగకపోతే మాత్రం… అమెరికా సైన్యం ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని.. అవసరమైతే తదుపరి చర్యలకు ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘అమెరికా మళ్లీ శక్తివంతంగా ముందుకు వస్తోంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇకపై ఇరాన్ బూటకపు మాటలు చెప్పొద్దని.. ఒప్పందం చేసుకోవాల్సిందేనన్నారు. ‘‘ఈలోగా మన గొప్ప సైన్యం సన్నద్ధమవుతూ.. విశ్రాంతి తీసుకుంటూ.. తదుపరి విజయం కోసం ఎదురుచూస్తోందని.. అమెరికా తిరిగి వస్తుంది!’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

 

US President Donald Trump posts on Truth Social – "All U.S. Ships, Aircraft, and Military Personnel, with additional Ammunition, Weaponry, and anything else that is appropriate and necessary for the lethal prosecution and destruction of an already substantially degraded Enemy,… pic.twitter.com/X7A5jL7z7w

— ANI (@ANI) April 9, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • global geopolitics breaking news
  • Hormuz Strait Crisis
  • Iran nuclear deal tensions
  • Israel Lebanon conflict news
  • JD Vance ceasefire statement

తాజావార్తలు

  • Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. మరోసారి ఉద్రిక్తతలు తప్పవా!?

  • Muse Spark: AIలో మార్క్ జుకర్‌బర్గ్ ప్రయోగం.. గూగుల్‌, ఓపెన్‌ఏఐకు ‘మ్యూస్ స్పార్క్’ సవాల్‌..

  • David Miller: “ఓటమికి కారణం నేనే”.. స్టేడియంలోనే ఏడ్చేసిన డేవిడ్ మిల్లర్.. హృదయాలను గెలిచిన అక్షర్!

  • Indian Bank Vacancy 2026: ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు ప్రారంభం.. భారీ జీతం

  • Stock Market: ఒక్కరోజు లాభాలు ఆవిరి.. భారీ నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions