గ్రీన్‌లాండ్ విషయంలో సహకరించకపోతే యూరోపియన్ దేశాలపై 200 శాతం సుంకం విధిస్తానని ఇటీవల ట్రంప్ బెదిరించారు. తాజాగా అధ్యక్షుడు మెత్తబడ్డారు. ఆ బెదిరింపును వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రంప్ పాల్గొన్నారు. ఇక నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో సమావేశం తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. ట్రూత్ సోషల్ మీడియాలో.. ఫిబ్రవరి 1 నుంచి యూరోపియన్స్ దేశాలపై అమల్లోకి రావాల్సిన సుంకాలు విధించడం లేదని ట్రంప్ రాసుకొచ్చారు. మిత్రదేశాలపై తాను విధించిన సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
