US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి
- పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల పౌరసత్వం
- ప్రతిపాదన రూపొందిస్తున్నట్లు కథనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై అమెరికాలో జన్మించిన పిల్లలకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు.. తల్లిదండ్రులు తమ పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్ హోదాకు సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సి రావొచ్చు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదన రూపొందిస్తున్నట్లు పేర్కొంది.
కొత్త ప్రతిపాదన ఏంటి?
Also Read
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్‌లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ప్రస్తుతం అమెరికాలో పుట్టిన పిల్లలకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసే తల్లిదండ్రులు.. తమకు, చిన్నారికి మధ్య ఉన్న సంబంధాన్ని నిరూపించడంతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డును సమర్పించాలి. దరఖాస్తు ఫారంలో తల్లిదండ్రుల పౌరసత్వ హోదాను కూడా వెల్లడించాలి. అయితే తమ ఇమ్మిగ్రేషన్ స్థితిని నిరూపించే పత్రాలను సాధారణంగా సమర్పించాల్సిన అవసరం లేదు.
అయితే ట్రంప్ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం ఈ విధానంలో మార్పులు చేయాలని భావిస్తోంది. పిల్లవాడు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పరిధిలోకి వస్తాడా లేదా అనే విషయాన్ని నిర్ణయించేందుకు తల్లిదండ్రుల వివరాలతో పాటు వారి పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్ హోదాకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించాలని ప్రతిపాదించింది.
ఏ పత్రాలు సమర్పించాలి?
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. పిల్లల పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసే తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు తమ పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్ హోదాను నిరూపించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అమెరికా పౌరులైతే చెల్లుబాటు అయ్యే అమెరికా పాస్‌పోర్ట్ లేదా జనన ధ్రువీకరణ పత్రం వంటి ఆధారాలను ఇవ్వాల్సి రావచ్చు. ఇమ్మిగ్రేషన్ హోదా ఉన్నవారు I-94 ఫారం లేదా శాశ్వత నివాస హక్కును నిరూపించే గ్రీన్ కార్డ్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని ఉపయోగించి సంబంధిత చిన్నారికి కొత్త నిబంధనల ప్రకారం అమెరికా పౌరసత్వం వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయించనుంది.
‘బర్త్ టూరిజం’పై ట్రంప్ ఫోకస్
అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించే విధానాన్ని పరిమితం చేయడం ట్రంప్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. ముఖ్యంగా అమెరికాలో పిల్లలకు జన్మనివ్వడం ద్వారా పౌరసత్వం పొందే విధానాన్ని ‘బర్త్ టూరిజం’గా పేర్కొంటూ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ట్రంప్ ఆగస్టు 6న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు అనుగుణంగా ఈ కొత్త ప్రతిపాదన రూపొందించినట్లు రాయిటర్స్ తెలిపింది. విదేశీ ప్రభుత్వాల కోసం అమెరికాలో పనిచేసే తల్లిదండ్రుల పిల్లలు, పౌరసత్వం పొందేందుకు మోసం లేదా వాణిజ్య లావాదేవీలకు పాల్పడే సందర్భాలు, అలాగే ‘ఏలియన్ ఎనిమీ’గా వర్గీకరించిన వ్యక్తుల పిల్లలకు పౌరసత్వం నిరాకరించే నిబంధనలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.
ట్రంప్ జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేసే ప్రయత్నాలపై ఇప్పటికే అమెరికా కోర్టుల్లో న్యాయపోరాటం కొనసాగుతోంది. ట్రంప్ తొలి ఆదేశం ప్రకారం.. కనీసం ఒక తల్లిదండ్రి అమెరికా పౌరుడు లేదా గ్రీన్ కార్డ్ ఉన్న చట్టబద్ధ శాశ్వత నివాసి అయితేనే పుట్టుకతో అమెరికా పౌరసత్వం లభించేలా నిబంధనలు తీసుకురావాలని ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాన్ని అమెరికా సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది. 6-3 మెజారిటీ తీర్పులో ట్రంప్ ఆదేశం 14వ రాజ్యాంగ సవరణలోని ‘సిటిజన్‌షిప్ క్లాజ్’ను ఉల్లంఘిస్తోందని మెజారిటీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా.. ట్రంప్ తాజా ఆదేశం అమలును అడ్డుకోవాలని, దాని వల్ల పౌరసత్వం కోల్పోయే అవకాశం ఉన్న శిశువుల తరఫున న్యాయవాదులు రెండు వేర్వేరు ఫెడరల్ కోర్టుల్లో క్లాస్ యాక్షన్ వ్యాజ్యాలు దాఖలు చేశారు. మేరీల్యాండ్‌లోని గ్రీన్‌బెల్ట్‌లో జరిగిన విచారణ సందర్భంగా.. డెమొక్రటిక్ అధ్యక్షుడు జో బైడెన్ నియమించిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి డెబోరా బోర్డ్‌మన్ ట్రంప్ ఆదేశంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను సవరించుకునేందుకు పిటిషనర్లకు ఆమె అనుమతి ఇచ్చారు. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు మాత్రం.. సంబంధిత ఫెడరల్ ఏజెన్సీలు ఆదేశాన్ని ఎలా అమలు చేస్తాయో ఇంకా అధికారిక మార్గదర్శకాలు జారీ చేయనందున.. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోవడం తొందరపాటు చర్య అవుతుందని వాదించారు.
ట్రంప్ కఠిన వైఖరి
అమెరికా పౌరసత్వానికి ఉన్న ప్రాధాన్యతను కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ తెలిపారు. పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియ కూడా ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం ముసాయిదా దశలోనే ఉంది. ఇది అమల్లోకి రావాలంటే సంబంధిత న్యాయ, పరిపాలనా ప్రక్రియలు పూర్తికావాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Konda Surkha : సీఎం రేవంత్‌కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!