Donald Trump: ట్రంప్ మైండ్‌లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: మాజీ దేశాధ్యక్షుడితో తనను తాను పోల్చుకుంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఆశించిన దానికి భిన్నంగా నెటిజన్లు దీనిపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవలే 80 లోకి అడుగుపెట్టిన ట్రంప్.. తాజాగా తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఏఐ (AI) సృష్టించిన చిత్రాలను వరసబెట్టి పోస్ట్ చేశారు. అందులో ఒక చిత్రంలో ఆయన ఏకంగా ప్రపంచాన్ని తన భుజాలపై మోస్తున్న దేవుడిలా కనిపించారు. అయితే, నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది మాత్రం ఈ చిత్రం కాదు, ఆయన షేర్ చేసిన మరో ఫోటో. న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో ఉన్నప్పటి తన పాత ఫోటోను, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలేజీ రోజుల్లో ఉన్న ఫోటోతో కలిపి ట్రంప్ పోస్ట్ చేశారు. తన ఫోటో కింద “20 ఏళ్ల వయసులో” అని ట్రంప్ రాశారు. కానీ, వాస్తవానికి అది 1964 నాటి అకాడమీ ఇయర్‌బుక్ కోసం తీసుకున్న ఆయన హైస్కూల్ గ్రాడ్యుయేషన్ ఫోటో. ఆ సమయంలో ట్రంప్ వయసు కేవలం 17 ఏళ్లే.
సోషల్ మీడియాలో మీమ్స్ వరద..
మరోవైపు పక్కనే ఉన్న ఒబామా ఫోటోలో మాత్రం వయసును ట్రంప్ సరిగ్గానే పేర్కొన్నారు. లాస్ ఏంజెల్స్‌లోని ఆక్సిడెంటల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు, నోట్లో సిగరెట్‌తో ఉన్న 18 ఏళ్ల ఒబామా ఫోటోను ఆయన జత చేశారు. అసలు ట్రంప్ తన వయసును 20 ఏళ్లుగా ఎందుకు పేర్కొన్నారనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ ఫోటో కాంబినేషన్‌పై సోషల్ మీడియా వేదికగా మీమ్స్ పేలుతున్నాయి. ఒబామా లుక్ ముందు ట్రంప్ తేలిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ట్రంప్ మిలిటరీ దుస్తుల్లో ఉన్న ఫోటోపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఎప్పుడూ సైన్యంలో పని చేయలేదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. “చిన్నప్పుడు ప్రవర్తనా లోపాలు, ఇతరులను వేధించే అలవాటు ఉండటం వల్లే ట్రంప్ తల్లిదండ్రులు ఆయన్ను మిలిటరీ బోర్డింగ్ స్కూల్‌కు పంపారు. ఇప్పుడు ఆ ఫోటో చూపించి తానేదో దేశ సరిహద్దుల్లో సేవ చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు” అని నెటిజన్ విమర్శించారు. నిజానికి వియత్నాం యుద్ధ సమయంలో ట్రంప్ ఐదుసార్లు సైనిక సేవ నుంచి మినహాయింపు పొందారు. ఇందులో నాలుగు సార్లు చదువు నిమిత్తం కాగా, ఐదోసారి వైద్య కారణాలను చూపి ఆర్మీలో చేరకుండా తప్పించుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో ట్రంప్ రూమ్మేట్గా ఉన్న ఆర్ట్ డేవి గతంలో మాట్లాడిన మాటలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. “ఆయన 16 ఏళ్ల వయసులోనే పెద్ద ‘ఈగోమానియాక్’ (తనను తాను అమితంగా ప్రేమించుకునేవాడు). తనను తాను పొగుడుకోవడంలో ముందుండేవాడు. తను చేసే ప్రతి పనిలోనూ తానే నంబర్ వన్ అని అందరూ గుర్తించాలని ఆరాటపడేవాడు” అని డేవి పేర్కొన్నారు.
Also Read
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
మరో నెటిజన్ ఒకడుగు ముందుకు వేసి.. వీరిద్దరి మధ్య వయసులో ఉన్నప్పటి ఫోటోలను కాకుండా, 46 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ఫోటోలను పోస్ట్ చేశారు. అందులో 46 ఏళ్ల ఒబామా 2008 ఎన్నికల ప్రచారంలో ఉంటే, అదే 46 ఏళ్ల వయసులో ఉన్న ట్రంప్.. వివాదాస్పద లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో కలిసి విందులో ఉన్న దృశ్యం కనిపించింది. ట్రంప్ తనను విమర్శించే ప్రత్యర్థులకు “ట్రంప్ డెరాంజ్మెంట్ సిండ్రోమ్” (TDS) ఉందని అంటుంటారు. అయితే ఇప్పుడు నెటిజన్లు ఆయనపై రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. “ఆయన పక్కవారికి TDS ఉందంటారు కానీ, ఆయనకు మాత్రం ‘ఒబామా డెరాంజ్మెంట్ సిండ్రోమ్’ (ODS) పట్టుకుంది” అని విమర్శిస్తున్నారు. “బరాక్ ఒబామా.. ట్రంప్ మెదడులో ఉచితంగా అద్దెకు ఉంటున్నారు” అంటూ మరికొందరు నెటిజన్లు ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఒబామా ఏమన్నారంటే..
ఒబామా వైట్ హౌస్ వీడిన తర్వాత కూడా ట్రంప్.. ఆయన గురించి మాట్లాడటం మరింత ఎక్కువైందట. ఆయన రోజుకు సగటున 1.8 సార్లు ఒబామా పేరును ప్రస్తావిస్తుంటారట. అయితే అమెరికా ప్రజల్లో మాత్రం ఒబామాకే ఆదరణ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన సర్వేలో 57 శాతం మంది ఒబామాను ఇష్టపడగా, ట్రంప్‌కు కేవలం 34 శాతం మద్దతు మాత్రమే లభించింది. ఈ నెలలో జరిగిన ‘ఆల్ ది స్మోక్’ పాడ్‌కాస్ట్‌లో ఒబామా మాట్లాడుతూ.. ట్రంప్ తనను నిరంతరం గుర్తు చేసుకోవడంపై స్పందించారు. “ఇది చాలా విచిత్రంగా ఉంది. ఏదేమైనా.. ఆయన మెదడులో నాకోసం ఒక ప్రత్యేకమైన సూట్ (రూమ్) కేటాయించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది” అంటూ ఒబామా నవ్వేశారు. ఈ వ్యవహారంపై స్పందించాల్సిందిగా వైట్ హౌస్‌ను కోరగా, వారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
తాజావార్తలు
-
Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?