Trump-Zelenskyy: రష్యాపై భారీ దాడి చేయండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ సూచన
- రష్యాపై భారీ దాడి చేయండి
- జెలెన్‌స్కీకి ట్రంప్ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు. దీంతో ట్రంప్‌నకు సహనం నశించింది. ఎన్ని సార్లు చెప్పినా పుతిన్ మాట వినడం లేదని కోపం కట్టలు తెంచికొచ్చినట్లుంది. ఈ నేపథ్యంలో 50 రోజుల్లో ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపకపోతే భారీగా సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించారు. కానీ రష్యా మాత్రం.. ఆ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పింది. దీంతో రష్యా ఇక మాట వినదని ట్రంప్ ఒక అంచనాకు వచ్చేశారు.
ఇది కూడా చదవండి: Twist : ‘వైరల్’ కోసం వల్గారిటీ.. సోషల్ మీడియా స్టార్స్ అరెస్ట్..!
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
ఈ నేపథ్యంలోనే రష్యాపై భారీ దాడికి ప్లాన్ చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ట్రంప్ కోరినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. అమెరికా అందించే ఆయుధాలు మాస్కోను తాకగలవా? అని జెలెన్‌స్కీని ట్రంప్ అడిగినట్లు తెలుస్తోంది. జూలై 4న పుతిన్‌తో ట్రంప్ మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ ప్రశ్న అడిగినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Lowest total in Tests: టెస్టుల్లో అత్యల్ప స్కోర్ చేసిన చేసిన జట్లు ఇవే..!
అమెరికా సరఫరా చేసే లాంగ్ రేంజ్ క్షిపణులు.. రష్యా లోపలికి దూసుకుని పోయేలా ప్లాన్ చేయాలని ట్రంప్ కోరినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ఈ మేరకు నివేదించింది. అమెరికా తయారు చేసిన ATACMS క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించే అవకాశంపై అధికారులతో ట్రంప్ చర్చించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాను పెంటగాన్ నిలిపివేసిన కొన్ని వారాల తర్వాత ఈ చర్చ జరగడం విశేషం.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!