Trump-NATO: నాటోపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం.. మిత్రుల సహాయం అక్కర్లేదని వెల్లడి
- ఇరాన్‌తో యుద్ధం వేళ నాటోపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
- మిత్రుల సహాయం అక్కర్లేదని వెల్లడి
- ట్రూత్ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌తో యుద్ధం వేళ నాటోపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మిత్రదేశాల అవసరం ఎన్నడూ లేదన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
‘‘మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఉగ్రవాద పాలనకు వ్యతిరేకంగా మేము చేస్తున్న సైనిక చర్యలో పాలుపంచుకోవడానికి నాటో మిత్రదేశాలు చాలా వరకు ఇష్టపడటం లేదు. వాస్తవానికి మేము చేస్తున్న దానికి దాదాపు ప్రతి దేశం గట్టిగా మద్దతు తెలిపినప్పటికీ.. ఇరాన్‌ను ఏ విధంగానూ, ఏ రూపంలోనూ అణ్వాయుధం కలిగి ఉండటానికి అనుమతించకూడదని చెప్పినప్పటికీ ఇది జరిగింది. అయితే వారి చర్య నన్ను ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే నేను నాటోను ఎప్పుడూ ఒక ఏకపక్ష వ్యవహారంగానే భావించాను. ఈ దేశాలను రక్షించడానికి మనం ఏటా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తుంటాము. మనం వారిని రక్షిస్తాము. కానీ వారు మన కోసం ఏమీ చేయరు. ముఖ్యంగా అవసరమైన సమయంలో’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read
- దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
- China: సినిమా హీరోలా? సైన్స్ వీరులా? ప్రపంచానికి కళ్లు తెరిపించిన చైనా
- US, Russia and Ukraine Talks: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు? నవంబర్‌లో కీలక త్రైపాక్షిక చర్చలు!
- Brazil Election 2026: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డా సిల్వా విజయం.. మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు!
‘‘అదృష్టవశాత్తూ ఇరాన్ సైన్యాన్ని అమెరికా నాశనం చేసింది. వారి నౌకాదళం పోయింది. వారి వైమానిక దళం పోయింది. వారి విమాన నిరోధక, రాడార్ పోయింది. బహుశా అన్నింటికన్నా ముఖ్యంగా దాదాపు ప్రతి స్థాయిలో ఉన్న నాయకులు హతమయ్యారు. ఇకపై మనకు, మన మధ్యప్రాచ్య మిత్రదేశాలకు, లేదా ప్రపంచానికి ఎప్పటికీ ముప్పు కలిగించలేరు! మనకు ఇంతటి సైనిక బలం ఉన్నందున… విజయం. మాకు ఇకపై నాటో దేశాల సహాయం అవసరం లేదు. నాటోను కూడా కోరుకోవడం లేదు. మేము దానిని ఎన్నడూ కోరుకోలేదు! అదే విధంగా.. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా విషయంలో కూడా. నిజానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడిగా చెబుతున్నాను. మాకు ఎవరి సహాయం అవసరం లేదు!.’’ అని ట్రంప్ రాసుకొచ్చారు.
కీర్ స్టార్మర్..
ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నప్పటికీ.. ‘‘దృష్టి ఉక్రెయిన్‌పైనే కేంద్రీకృతమై ఉండాలి.’’ అని యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మంగళవారం లండన్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అన్నారు. ‘‘ఇరాన్‌తో స్పష్టంగా సంఘర్షణ జరుగుతోంది. కానీ ఉక్రెయిన్‌లో ఏమి జరుగుతుందో తెలిసిందే. మన మద్దతు అవసరాన్ని మనం విస్మరించకూడదు.’’ అని స్టార్మర్ అన్నారు.
తాజావార్తలు
-
Ind Vs NZ 3rd T20: వెల్లింగ్టన్ టీ20కి సర్వం సిద్ధం.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్స్..
-
Srinidhi Shetty: గ్లామర్ పక్కనపెట్టి ‘అమ్మ’ పాత్రలో కేజీఎఫ్ బ్యూటీ.. కెరీర్ రిస్క్?
-
Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
-
CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు! 15 జిల్లాలకు భారీ వర్ష సూచన
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!