Site icon NTV Telugu

Trump: వలసదారులకు ట్రంప్ ప్రత్యేక ఆఫర్

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే వలసదారుల్ని కట్టడి చేశారు. ఇక అక్రమంగా అమెరికాలో ఉంటున్న వలసదారులకు తాజాగా ట్రంప్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. స్వీయ బహిష్కరణ చేసుకోవాలనుకునే వారికి విమాన ఖర్చులతో పాటు కొంత నగదు అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యంగా జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిపై ఇమిగ్రేషన్ అధికారులు దృష్టి పెట్టి ఏరివేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది స్వదేశాలకు పంపించారు. భారత్‌తో పాటు అనేక దేశాల పౌరులను వెనక్కి పంపించారు. తాజాగా మరోసారి వలసదారులు స్వయంగా వెళ్లిపోవాలని కోరింది. అలా వెళ్లేవారికి విమాన ఖర్చులతో పాటు కొంత నగదును అందిస్తామని ప్రకటించారు. ఇక వెళ్లిపోయిన వారిలో మంచి వారుంటే.. చట్టపద్ధతిలో వెనక్కి తీసుకురావడానికి అనుమతిస్తామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Harassment Assault: స్నాప్ చాట్లో పరిచయం.. న్యూడ్ కాల్స్తో రొమాన్స్.. తీరా చివరకు..?

Exit mobile version