Site icon NTV Telugu

Trump: ‘గెట్ అవుట్’.. రిపోర్టర్‌పై ట్రంప్ ఆగ్రహం.. అసలేం జరిగిందంటే..!

Trump1

Trump1

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓ రిపోర్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ ఫైరయ్యారు. ఆ రిపోర్టర్‌ను ‘గెట్ అవుట్’ అన్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.

అసలేం జరిగిందంటే..
బుధవారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్‌తో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా సమావేశం అయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడుతుండగా సడన్‌గా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్‌బీసీ విలేకరి వివాదాస్పదమైన ఖతార్ విమానాన్ని గురించి ప్రశ్నించాడు. అలాంటి బహుమతిని స్వీకరించడం నైతికమైనదా? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న ట్రంప్‌నకు కోపం తెప్పింది. ‘‘నీవు చెడ్డ రిపోర్టర్‌వి.. నీవు నీ గురించి సిగ్గుపడాలి’’ అని ఫైరయ్యారు. రిపోర్టర్ మరిన్ని ప్రశ్నలు సంధించబోతుండగా ట్రంప్ అడ్డు తగులారు. ‘‘అయినా ఖతార్ జెట్‌తో నీకేం పని.. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఖతార్ వాళ్లు అమెరికా వైమానిక దళానికి బహుమతిగా ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. అసలు నీకు తెలివిలేదు. నువ్వు ఏం అడుగుతున్నావో నీకే తెలియదు. ముందు నీ ఆఫీస్‌కు వెళ్లు. మీ మాతృసంస్థపై దర్యాప్తు చేయాలి. గెట్ అవుట్’’’ అంటూ ట్రంప్ చిందులేశారు.

ఇటీవల ట్రంప్ ఖతార్‌లో పర్యటించారు. పర్యటనలో 400 మిలియన్ డాలర్లు విలువ చేసే విమానాన్ని ఖతార్ రాజకుటుంబం.. ట్రంప్‌నకు బహుమతిగా ఇచ్చింది. అయితే విమానం గురించి ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక పోస్ట్ పెట్టారు. ఖతార్ విమానం తనకు కాదని.. అమెరికా వైమానిక దళానికి అని చెప్పారు. ఖతార్‌తో ఉన్న సంబంధాలు కారణంగా అమెరికాకు బహుమతిగా వచ్చిందని పేర్కొన్నారు. కొత్త బోయింగ్‌లు వచ్చే వరకు ఈ విమానాన్ని ప్రభుత్వం తాత్కాలిక ఎయిర్‌ ఫోర్స్ వన్‌గా ఉపయోగిస్తామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Jagan Mohan Reddy: వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!

అలాగే పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ కూడా స్పందిస్తూ.. ఖతార్ విమానాన్ని అంగీకరిస్తున్నట్లు చెప్పారు. విమాన బదిలీ యూఎస్ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉందని తెలిపారు. దీన్ని అమెరికా వైమానిక దళానికి.. అధ్యక్షుడి ప్రయాణానికి సరిగ్గా ఉందని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Keeravani : ‘వీరమల్లు’ లో ఐటెం సాంగ్.. కానీ పవన్ ఏమన్నారంటే !

అయితే ఓవల్ ఆఫీసులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జోక్యం పుచ్చుకుని ‘‘క్షమించండి.. మీకు ఇవ్వడానికి నా దగ్గర విమానం లేదు.’’ అంటూ ట్రంప్‌ను రామఫోసా నవ్వించే ప్రయత్నం చేశారు.

ఇంతలో ట్రంప్ జోక్యం పుచ్చుకుని దక్షిణాఫ్రికాలో జరుగుతున్న నేరాలు-ఘోరాలు గురించి నిలదీశారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులపై జరుగుతున్న హింస గురించి నిలదీశారు. జాత్యహంకార చట్టాలు, ముఖ్యమైన అంశాల నుంచి దృష్టి మళ్లిస్తున్నారంటూ ట్రంప్ ఆరోపించారు. ఇంతలో రామఫోసా కలుగజేసుకుని బాధితుల్లో నల్లజాతీయులే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇంతలో ట్రంప్ మళ్లీ జోక్యం కలుగజేసుకుని ఒక వీడియోను ప్లే చేశారు. అందులో తెల్లజాతీ రైతులపై జరుగుతున్న హింసను చూపించారు. శ్వేతజాతి రైతులపై జరుగుతున్న హింసకు ఈ వీడియోనే నిదర్శనం అంటూ ట్రంప్ వాదించారు. ఇంతలో రామఫోసా స్పందిస్తూ.. ఈ వీడియోను ఇప్పటి వరకు చూడలేదని.. దీని వెనుక ఏం జరిగిందో తెలుసుకుంటానని బదులిచ్చారు. ఇలా ఇద్దరి మధ్య హాట్ హాట్‌గానే సమావేశం జరిగింది.

 

Exit mobile version