Site icon NTV Telugu

Trump: ఓ వైపు కోర్టు మొట్టికాయలు.. ఇంకోవైపు ట్రంప్ దూకుడు.. అన్ని దేశాలపై 10 శాతం టారిఫ్ విధింపు

Trump

Trump

అధ్యక్షుడు ట్రంప్‌కు అమెరికా అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగలింది. గ్లోబుల్ టారిఫ్‌లను కొట్టేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పరిణామంపై ట్రంప్‌కు భారీ షాక్‌ తగిలినట్లైంది. దీంతో న్యాయమూర్తులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మూర్ఖులు.. లాప్‌డాగ్‌లు’’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కోర్టు సిబ్బంది తీరును చూసి సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Off The Record : కవితను లైట్ తీసుకోవడమే బెటరని బీఆర్ఎస్ నేతలు డిసైడయ్యారా?

అలా కోర్టు మొట్టికాయలు వేసిందో లేదో.. మరోసారి ట్రంప్ తన ప్రతాపాన్ని చూపించారు. అన్ని దేశాలపై 10 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఓవల్ కార్యాలయం నుంచి కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేసి సోషల్ మీడియాలో వెల్లడించారు. కొత్త ఉత్తర్వు ప్రకారం అన్ని దేశాల నుంచి దిగుమతులపై 10 శాతం సుంకం విధించినట్లు పేర్కొన్నారు. అన్ని దేశాలపై 10 శాతం సుంకం విధించడంపై తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Duddilla Sridhar Babu : డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ

అంతకముందు మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 కింద ప్రస్తుత సుంకాలను అదనంగా 10 శాతం ప్రపంచ సుంకాన్ని ఆదేశిస్తానని చెప్పారు. అవసరమైతే దానికంటే ఎక్కువ సుంకాలను విధించగలను అని హెచ్చరించారు. వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 కింద విధించిన సుంకాలు దాదాపు ఐదు నెలల వరకు అమలులో ఉంటుందన్నారు.

Exit mobile version