Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Secret Flight: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించిన సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జూలైలో టర్కీలోని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం అనంతరం ట్రంప్ దేశం విడిచి వెళ్లే సమయంలో అత్యంత రహస్య భద్రతా ఆపరేషన్ నిర్వహించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇరాన్‌కు చెందిన వ్యక్తులు లేదా అనుబంధ బలగాల నుంచి ట్రంప్‌కు విశ్వసనీయమైన ముప్పు ఉందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నాటో సదస్సు కోసం ట్రంప్ అంకారాకు కొత్తగా ఖతార్ అందించిన బోయింగ్ 747-8 విమానంలో వెళ్లారు. ఈ విమానం భవిష్యత్తులో అధ్యక్షుడి అధికారిక విమానంగా ఉపయోగించేందుకు సిద్ధం చేస్తున్నది. అయితే, టర్కీ నుంచి తిరుగు ప్రయాణం సమయంలో భద్రతా కారణాలతో ఆ విమానంలో కాకుండా పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో వెళ్లాలని నిర్ణయించారు. ఆ సమయంలో ట్రంప్ స్వయంగా పాత విమానాన్ని ఉపయోగించడాన్ని సరదాగా “పాత జ్ఞాపకాల కోసం” అని పేర్కొన్నారు.
Also Read
- Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
- Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
- Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం అసలు ఆపరేషన్ మరింత రహస్యంగా సాగింది. కెమెరాల ముందు ట్రంప్ పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఎక్కినట్లు కనిపించినప్పటికీ, అనంతరం ఆయనను విమానాశ్రయంలోని క్యాటరింగ్ ట్రక్కు ద్వారా మరో ప్రాంతానికి తరలించినట్లు Washington Post నివేదికను ఉటంకిస్తూ Reuters తెలిపింది. అక్కడి నుంచి ట్రంప్‌ను C-32A అనే చిన్న సైనిక విమానంలో ఎక్కించి టర్కీ నుంచి బయటకు తీసుకెళ్లినట్లు సమాచారం.
ఈ సమయంలో పాత ఎయిర్ ఫోర్స్ వన్ను ఒక డీకాయ్‌గా ఉపయోగించినట్లు తెలుస్తోంది. ట్రంప్ అందులోనే ప్రయాణిస్తున్నారని మీడియా ప్రతినిధులు, కొంతమంది వైట్ హౌస్ సిబ్బంది భావించేలా ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి ట్రంప్ మరో విమానంలో ఉన్న విషయం కొంతమందికి కూడా తెలియకుండా ఉంచినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. రెండు విమానాలు బ్రిటన్‌లోని RAF మిల్డెన్‌హాల్‌కు కొన్ని నిమిషాల వ్యవధిలో చేరినట్లు సమాచారం.
ఇరాన్ ముప్పుతోనే విమానం మార్పు
అమెరికా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రంప్ భద్రతకు ఇరాన్ లేదా దాని అనుబంధ ప్రాక్సీ బలగాల నుంచి విశ్వసనీయమైన ముప్పు ఉందన్న నిఘా సమాచారం అందింది. కొన్ని నివేదికల ప్రకారం, ట్రంప్ లేదా ఆయన విమానాన్ని లక్ష్యంగా చేసుకునే మిసైల్ దాడి ముప్పుపై కూడా సమాచారం వచ్చింది. దీంతో సీక్రెట్ సర్వీస్ విమానాన్ని మార్చాలని సూచించినట్లు CBS News, ఇతర మీడియా సంస్థలు గతంలో నివేదించాయి.
కొత్తగా ఖతార్ అందించిన బోయింగ్ 747-8 విమానం అత్యాధునిక సదుపాయాలతో ఉన్నప్పటికీ, పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఉన్న స్థాయిలో రక్షణ వ్యవస్థలు అప్పటికి అందుబాటులో లేవన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఇరాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో అధ్యక్షుడి ప్రయాణానికి విమానం భద్రతపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
మీడియాను కూడా తప్పుదోవ పట్టించిన ఆపరేషన్
ఈ ఆపరేషన్‌లో భాగంగా ట్రంప్ నిజంగా ఏ విమానంలో ప్రయాణిస్తున్నారన్న విషయాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచారు. ట్రంప్ పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఉన్నారని భావించిన మీడియా ప్రతినిధులకు ప్రయాణ సమయంలో విమాన కిటికీల తెరలను మూసి ఉంచాలని సూచించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ చర్య ఉద్దేశం ట్రంప్ ఉన్న విమానాన్ని గుర్తించడం కష్టతరం చేయడమేనని తెలుస్తోంది.
ట్రంప్ భద్రత కోసం ఇలాంటి డీకాయ్ ఆపరేషన్‌ను గతంలో కూడా అమెరికా నిర్వహించింది. 2000లో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ఇలాంటి మోసపూరిత ప్రయాణ వ్యూహాన్ని ఉపయోగించిన ఘటనను అధికారులు ఉదాహరణగా చూపుతున్నారు. టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం జూలై 7, 8 తేదీల్లో అంకారాలో జరిగింది. ఆ సమయంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజా వివరాలు వెలుగులోకి రావడంతో అధ్యక్షుడి భద్రత, కొత్త ఖతార్ విమానం రక్షణ సామర్థ్యాలపై మరోసారి చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
-
King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
-
Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!