US-Iran War: ‘‘మనం యుద్ధంలో ఉన్నాం’’.. పైలట్ గల్లంతుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘‘మనం యుద్ధంలో ఉన్నాం’’
- పైలట్ గల్లంతుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- తప్పిపోయిన పైలట్ కోసం అమెరికా గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం యుద్ధంలో ఉన్నామన్న సంగతి గుర్తుంచుకోవాలని అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. ప్రస్తుతం ఇరాన్.. అమెరికా యుద్ధ విమానాలు టార్గెట్ చేసుకుంది. నిన్న ఇరాన్ గగనతలంలో అమెరికా ఎఫ్-15ను కూల్చేసింది. అయితే ఒకరు సేఫ్‌గా బయటపడగా.. ఇంకొకరి ఆచూకీ గల్లంతైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ఇది యుద్ధమని.. మన యుద్ధంలో ఉన్న సంగతి మరిచిపోవద్దని వ్యాఖ్యానించారు. ఇది ఇరాన్‌తో జరుగుతున్న చర్చలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ గగనతలంలో కూల్చివేయబడిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగుల్ యుద్ధ విమానం నుంచి బయటకు దూకిన సిబ్బందిలో ఒకరి కోసం అమెరికా, ఇజ్రాయెల్ దళాలు తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ట్రంప్ నిరాకరించారు. ఇది సున్నితమైన సైనిక చర్య అని.. మీడియా దీనిపై అతిగా ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.
ఇదిలా ఉండగా ఇరాన్‌లోని హార్ముజ్ జలసంధి దగ్గర కూలిపోయిన మరో అమెరికా యుద్ధ విమానం నుంచి పైలట్‌ను సురక్షితంగా రక్షించినట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Kamal Haasan: ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు చేదు అనుభవం
ఇరాన్ విడుదల చేసిన చిత్రాలను విశ్లేషించిన అమెరికా మీడియా సంస్థలు.. అవి ఎఫ్-15 విమాన శకలాలేనని గుర్తించాయి. ఖుజెస్తాన్ ప్రావిన్స్ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుత ఘర్షణలో అమెరికా యుద్ధ విమానం కూల్చివేయబడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇదే సమయంలో యుద్ధ చర్యలతో పాటు ఇరాన్‌తో చర్చలు కూడా కొనసాగుతున్నప్పటికీ.. టెహ్రాన్ చర్చలకు దూరంగా ఉండటంతో శాంతి ప్రయత్నాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి.
ఇది కూడా చదవండి: Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..
తాజావార్తలు
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?