Site icon NTV Telugu

Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీ ఫిక్స్.. ఎప్పుడంటే..!

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సమావేశం తేదీ ఫిక్స్ అయింది. ఈనెల 15న అలాస్కాలో పుతిన్‌ను కలుస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు. సౌదీ అరేబియా వేదికగా చర్చలు కూడా జరిగాయి. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇదిలా ఉంటే ట్రంప్‌తో భేటీకి ముందు శుక్రవారం ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పుతిన్ సంప్రదింపులు జరిపారు.

ఇది కూడా చదవండి: Tribals Attack: అటవీ అధికారులపై రెచ్చిపోయిన గిరిజనులు.. కళ్లలో కారం చల్లి, కర్రలతో దాడి!

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ట్రంప్-పుతిన్ భేటీ జరగలేదు. ఆగస్టు 15న ట్రంప్-పుతిన్ కలిస్తే ఇదే తొలిసారి అవుతుంది. అయితే ఈ భేటీలో జెలెన్‌స్కీ పాల్గొంటారా? అనేది ఇంకా తెలియదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. ఈసారి జరిగే సమావేశం తర్వాతైనా కాల్పుల విరమణ జరుగుతుందో లేదో చూడాలి.

ఇది కూడా చదవండి: Murder : చెల్లెలి మీద ప్రేమ.. బావను మర్డర్ చేసిన బామ్మర్దులు

2022 నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం సాగుతోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ భవంతులు నేలకూలాయి. ఇరు దేశాల మధ్య భారీ నష్టం జరిగింది. వాటి తర్వాత జరిగిన యుద్ధాలన్నీ ఆగిపోయాయి గానీ.. ఈ యుద్ధం మాత్రం ఇంకా చల్లారలేదు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆయా దేశాలు కాల్పుల విరమణకు ప్రయత్నించినా ప్రయోజనం దక్కలేదు.

Exit mobile version