Site icon NTV Telugu

Trump: మోడీ మంచి స్నేహితుడు.. గాజా శాంతి సదస్సులో ట్రంప్ ప్రశంసలు

Tump2

Tump2

ప్రధాని మోడీని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. అది కూడా ప్రపంచ అగ్ర నాయకులంతా ఒక చోట నిలబడి ఉండగా.. అంతేకాకుండా పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పక్కనే ఉండగా ఈ సంఘటన జరగడం విశేషం. ఈజిప్టులో గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్ర నాయకులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీ తనకు చాలా మంచి స్నేహితుడు అంటూ ప్రశంసించారు. భారతదేశం-పాకిస్థాన్ చాలా చక్కగా కలిసి జీవిస్తాయని తాను భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. వెనుకనే ఉన్న షెహబాజ్ షరీఫ్‌ను చూసి ట్రంప్ మాట్లాడగానే అందరూ నవ్వులు.. పువ్వులు పూయించారు. భారతదేశం తమకు అగ్ర స్థానంలో ఉన్న మంచి స్నేహితుడిగా ఉన్న గొప్ప దేశం అని ట్రంప్ కొనియాడారు. మోడీ అద్భుతంగా పని చేస్తారని చెప్పుకొచ్చారు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Telangana : రేవంత్‌ సర్కార్‌ విప్లవాత్మక నిర్ణయం

అనంతరం సభలో ప్రసంగించాలని షెహబాజ్ షరీఫ్‌ను ట్రంప్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. ట్రంప్ అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా పశ్చిమాసియాలో శాంతి నెలకొందని కొనియాడారు. భారతదేశం-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపారని.. అందుకే ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు షరీష్ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Off The Record: ఆ జనసేన నియోజకవర్గంలో కొండలకు కొండలే మాయమైపోతున్నాయా?

దక్షిణాసియాలోనే కాకుండా పశ్చిమాసియాలో కూడా లక్షలాది మంది ప్రాణాలను కాపాడినందుకు ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి మళ్లీ నామినేట్ చేయాలనుకుంటున్నట్లు షరీఫ్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో యుద్ధాలను ట్రంప్ ఆపారని.. కచ్చితంగా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హుడని తెలిపారు.

గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సోమవారం 20 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. అలాగే పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. బందీల విడుదల సందర్భంగా ట్రంప్ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఇక ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ట్రంప్‌కు గొప్ప ఘనత దక్కింది. ఎంపీలంతా నిలబడి చప్పట్లతో అభినందించారు.

 

Exit mobile version