Trump: అసిమ్ మునీర్, షరీఫ్‌పై ప్రశంసలు.. పాకిస్థాన్ వెళ్తానన్న ట్రంప్
- అసిమ్ మునీర్, షరీఫ్‌పై ట్రంప్ ప్రశంసలు
- మంచి పని చేస్తున్నారని పొగడ్తలు
- సంతకం కోసం పాకిస్థాన్ వెళ్తానన్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసిమ్ మునీర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. షరీఫ్, మునీర్ చాలా మంచి పని చేస్తున్నారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. త్వరలోనే ఇరాన్‌తో ఒప్పందం జరగబోతుందన్నారు. అయితే సంతకం చేసేందుకు వ్యక్తిగతంగా పాకిస్థాన్‌కు వెళ్తారా? అని విలేకరి అడగ్గా… ‘‘పాకిస్థాన్ చాలా మంచిది. వాళ్లు గొప్ప పని చేస్తున్నారు. ఇస్లామాబాద్‌లో ఒప్పందంపై సంతకాలు జరిగితే వ్యక్తిగతంగా పాకిస్థాన్ వెళ్తాను.’’ అని బదులిచ్చారు.
ఇది కూడా చదవండి: Samrat Choudhary: బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి బెదిరింపులు.. ఒకరు అరెస్ట్
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఏప్రిల్ 21తో ముగుస్తుంది. ఆలోపే శాంతి ఒప్పందం జరిగేలా చూసేందుకు అసిమ్ మునీర్ ఇరాన్‌కు వెళ్లారు. ఇరాన్ అగ్ర నాయకత్వంతో సమావేశమై ఒప్పందంపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే యురేనియం అప్పగించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. గాల్లో మేడలు కట్టొద్దని సూచించింది.
ఇది కూడా చదవండి: Helicopter Crash: ఇండోనేషియాలో కూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి
అయితే ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకుని యుద్ధాన్ని ముగించాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మునీర్, షరీఫ్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. శాంతి ఒప్పందం జరుగుతుందా? లేదంటే యుద్ధం కొనసాగుతుందా? అన్నది తేలాల్సి ఉంది.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?