Site icon NTV Telugu

Donald Trump: ‘‘వారిద్దరు అద్భుతం’’.. పాకిస్తాన్ నేతలపై ట్రంప్ ప్రశంసల జల్లు..

Donald Trump

Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లపై ప్రశంసలు కురిపించారు. సోమవారం వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ఇద్దరు పాకిస్తాన్ నేతలు ‘‘అద్భుతమైనవారు’’గా కొనియాడారు. గాజా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రతిపాదించిన 20-పాయింట్ల ప్రణాళికకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చిందని,వీరిద్దరు పూర్తి మద్దతు ఇస్తోందని ట్రంప్ అన్నారు.

Read Also: Odisha: గోడ దూకి ప్రియురాలి ఇంట్లోకి ప్రవేశించిన ప్రియుడు.. విద్యుత్ షాక్ తగిలి మృతి..

పాకిస్తాన్ ఇద్దరు నేతలు మొదటి నుంచి మా వెంట ఉన్నారని, వారు అద్భుతమైన వారని, వారు ఒప్పందాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నట్లు ప్రకటించారని, వారు దీనిని 100 శాతం సమర్థించారని ట్రంప్ అన్నారు. గాజా యుద్ధాన్ని ముగించేందుకు కొత్త ప్రణాళికకు మద్దతు ఇచ్చినందుకు ముస్లిం, అరబ్ దేశాలకు ట్రంప్ థాంక్స్ చెప్పారు.

ఇజ్రాయిల్, హమాస్ ఈ ప్రతిపాదనల్ని అంగీకరిస్తే యుద్ధం వెంటనే ముగుస్తుంది. బందీలను విడుదల చేస్తే, గాజాలో సైనిక చర్యను ఇజ్రాయిల్ ఉపసంహరించుకుంటుంది. అక్టోబర్ 07 నాటి దాడుల తర్వాత, హమాస్ బందీలుగా పట్టుకున్న ఇజ్రాయిలీలు, ఇతర దేశాల వారిని విడుదల చేస్తే ఇజ్రాయిల్ 250 మంది జీవిత ఖైదీలను, 1700 మంది గాజా ప్రజల్ని విడుదల చేస్తుంది.

Exit mobile version