ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలో భేటీకాబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే.. రెండు దేశాల మధ్య సంబంధాలు మరోసారి బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా అధికారిక సంకేతాలు వెలువడ్డాయి.
ఇది కూడా చదవండి: Zelenskyy: రష్యా తీరును ప్రపంచ దేశాలు ఖండించాలి.. యూఎన్‌లో జెలెన్‌స్కీ పిలుపు
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్న.. మోడీ-ట్రంప్ బలమైన సంబంధాన్ని కొనసాగిస్తున్నారని విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీలైనంత త్వరలో ఇద్దరి మధ్య సమావేశం జరగబోతుందని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివరిలోగానీ.. వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ ఈ సమావేవం ఉంటుందని పేర్కొన్నారు.
త్వరలో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ ఏడాది చివర్లోగానీ.. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగొచ్చు. ప్రస్తుతం తేదీలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సమ్మిట్‌లో మోడీ-ట్రంప్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని సంక్రమంగా జరిగితే ఈ ఏడాదిలోనే భేటీ ఉండొచ్చు.
ట్రంప్ సడన్‌గా భారత్‌పై సుంకాల భారం మోపారు. తొలుత భారత్‌పై 25 శాతం సుంకం వేశారు. అనంతరం మళ్లీ బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. అయితే రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామంటూ మోడీ ప్రకటించారు. ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టం.. జుబీన్ గార్గ్ మృతిపై అస్సాం సీఎం హెచ్చరిక
