Site icon NTV Telugu

Trump: గోల్డ్ కార్డు ఎవరి కోసం? భారతీయ విద్యార్థులనుద్దేశించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు ప్రవేశపెట్టారు. ఈ కార్డు ద్వారా పౌరసత్వం లభించనుంది. 1 మిలియన్ చెల్లించి గోల్డ్ కార్డు పొంద వచ్చని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయ విద్యార్థులనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: భయంతో తప్పుడు భాష మాట్లాడారు.. అమిత్ షా ప్రసంగంపై రాహుల్ గాంధీ అభ్యంతరం

వార్టన్, హార్వర్డ్, ఎంఐటీ వంటి అగ్రశ్రేణి అమెరికన్ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన భారత్, చైనా విద్యార్థులు అమెరికాను విడిచివెళ్లడం సిగ్గుచేటు అన్నారు. అయితే గోల్డ్ కార్డు ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులను కంపెనీలు నిలుపుకునే అవకాశం ఉందని తెలిపారు. దేశంలోకి ప్రతిభ కలిగిన వ్యక్తి రావడం ఒక బహుమతి అన్నారు. అలాంటి వారిని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారు. గోల్డ్ కార్డ్ వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చిందని.. కంపెనీలు వార్టన్, హార్వర్డ్, MIT వంటి అగ్రశ్రేణి అమెరికన్ విశ్వవిద్యాలయాల నుంచి నియమించుకోవచ్చని తెలిపారు. అలాంటి వారి కోసం గోల్డ్ కార్డ్‌ను కొనుగోలు చేయవచ్చని ప్రకటించారు. అమెరికాలో శాశ్వత నివాసాన్ని అందించే గ్రీన్ కార్డ్ కంటే గోల్డ్ కార్డ్ వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని, కంపెనీలు కూడా దానితో చాలా సంతోషంగా ఉంటాయని ట్రంప్ అన్నారు.

గోల్డ్ కార్డ్ ధర..
యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. 1 మిలియన్ చెల్లించి గోల్డ్ కార్డ్ పొందవచ్చని.. కార్పొరేషన్లు 2 మిలియన్ల చెల్లించి కొనుగోలు చేయవచ్చు అని తెలిపారు. కంపెనీల విషయానికొస్తే ఈ కార్డు ఉద్యోగిని నిలుపుకోవడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. అమెరికన్ కావడానికి పూర్తి అర్హత కలిగి ఉంటారన్నారు.

 

Exit mobile version