Trump on Iran Attack: ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవడానికి అమెరికా తొందరపడటం లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడుల్లో ఆ దేశ నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎయిర్ ఢిపెన్స్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. వచ్చే వారం ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా.. ‘‘ముందుగానే ఈ విషయాన్ని వెల్లడిస్తానా?’’ అంటూ సమాధానాన్ని దాటవేశారు.
ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని తన మార్-ఎ-లాగో క్లబ్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు చెందిన దాదాపు అన్ని ప్రధాన సైనిక పరికరాలు, పలు తయారీ కేంద్రాలు ధ్వంసమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. అణు కేంద్రాలను కూడా టార్గెట్ చేసినట్లు చెప్పారు. ఇంకా ఒకటి లేదా రెండు స్థావరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటిని కడా 10 నిమిషాల్లో అంతం చేయగలనిమని చెప్పారు.
వచ్చే వారం మళ్లీ యుద్ధం ప్రారంభమవుతుందా? అని ప్రశ్నించిన నేపథ్యంలో… ‘‘నేను అలా చేస్తే, ఈ విషయం మీకు ముందుగా ఎందుకు చెబుతాను.? ఒక వేళ దాడి చేయద్దని నిర్ణయించకున్నా, ఆ విషయాన్ని మీకు చెబుతానా? దీనిపై నేను ఏమీ చెప్పలేను’’ అని ట్రంప్ అన్నారు. ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని, అయినప్పటికీ ఆ దేశాన్ని నమ్మలేనిమని అన్నారు. గతంలో ఒప్పందాలు చేసుకున్నా ఆ తర్వాత ఇరాన్ వాటి నుంచి వెనక్కి వెళ్లిందని ట్రంప్ విమర్శించారు.

