Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్

  • భారతదేశంపై, ప్రధాని మోడీపై ట్రంప్ ప్రశంసలు
  • ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ అంటూ పోస్ట్
  • ఇరుదేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నట్లు సంకేతాలు
Trumpmodi

Trumpmodi

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరోసారి భారతదేశంపై, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు తన సొంత ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

×
×
Ad

 

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ‘‘ఫ్రీడమ్ ఎట్ 250’’ వేడుకలు జరిగాయి. అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారత, అమెరికా ఉన్నతాధికారులంతా హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సహా సుమారు 1,500 మంది అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఆర్.రెహ్మాన్ సంగీత కచేరి అలరించింది.

ఈ వేడుకల సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ అకస్మాత్తుగా రాయబారి సెర్గియా గోర్‌కు ఫోన్ కాల్ చేశారు. వేడుకలకు హాజరైన అతిథులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. భారత్‌పై ప్రశంసలు కురిపించారు. “నాకు భారత్ అంటే చాలా ఇష్టం. భారత్‌తో అమెరికా సంబంధాలు మరింత బలపడాలి” అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అలాగే ప్రధాని మోడీ నాయకత్వాన్ని కూడా ప్రశంసించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ జాతీయ మీడియాలో కథనాన్ని ప్రచురించింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను తాజాగా ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ షేర్ చేశారు. దీంతో రెండు దేశాలకు సంబంధించిన సంబంధాలపై చర్చకు వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఆ మధ్య కొంత కాలం విభేదాలు ఉన్నప్పటికీ ఇప్పుడు సర్దుకుపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సంబంధాలు బలపడినట్లుగా సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై కీలక చర్చలు కొనసాగుతున్నాయి. సుంకాలు, మార్కెట్ యాక్సెస్, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల అధికారులు చర్చలు జరుపుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.