Site icon NTV Telugu

Trump: అధ్యక్ష పదవి ఆషామాషీ కాదు.. చాలా ప్రమాదకరం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవిలో ఉండటం చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కారు రేసింగ్‌, బుల్‌ రైడింగ్‌ లాగే.. అధ్యక్ష పదవిలో ఉన్నవాళ్లకు కూడా చావు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేమన్నారు. ఈ విషయం గురించి తనకు ఎవరైనా ముందే చెప్పుంటే.. అసలు ఈ రేసులో ఉండేవాడిని కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతేడాది ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన హత్యాయత్నం ఘటనను గుర్తుచేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు..

ఇక పలు దేశాలపై విధించే సుంకాల విషయంలో కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలపై నిర్ణయం తీసుకోవడానికి అమెరికాకు చాలా వెసులుబాటు ఉందని చెప్పారు. సుంకాలను తిరిగి విధించడానికి జులై 9 గడువును ఇప్పుడే నిర్ణయించలేమని చెప్పుకొచ్చారు. ఇక కెనడాతో వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Warangal Horror: ‘క్షమించండి’ అన్నా వినలేదు.. వరంగల్‌లో మహిళపై దారుణ హింస

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో సారి అధికారంలోకి వచ్చాక పలు దేశాలపై భారీగా టారిఫ్‌లు విదించారు. అయితే ఆయా దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో టారిఫ్‌లపై 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ గడువు జులై తొమ్మిదో తేదీతో ముగియనుంది. జూలై 9 తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version