అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్.. ప్రియురాలు బెట్టినా ఆండర్సన్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. వైట్‌హౌస్ హాలిడే పార్టీలో ఈ నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ట్రంప్, ప్రభుత్వాధికారులు, ఇతర నేతలు పాల్గొన్నారు. కొత్త జంటను పొడియం దగ్గరకు పిలిచి ట్రంప్ అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ట్రంప్ జూనియర్ నిశ్చితార్థం చేసుకోవడం ఇది మూడోసారి. మొదట మాజీ మోడల్, నటి వెనెస్సాను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఐదుగురు సంతానం. 2018లో వెనెస్సా విడాకులకు దరఖాస్తు చేసుకుంది. తర్వాత యూఎస్ టెలివిజన్ ప్రముఖురాలు కింబర్లీ గిల్‌ఫోయిల్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా ఆండర్సన్‌తో దాదాపు ఏడాది నుంచి డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. గత నెలలో భారత్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన వివాహ వేడుకలో కూడా ఈ జంట సందడి చేసింది. తాజ్‌మహల్, అనంత్ అంబానీకి చెందిన ఫారెస్ట్‌ను సందర్శించారు. ఈ వివాహ వేడుకలో డ్యాన్స్‌తో కూడా సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
CONGRATULATIONS: President Trump just announced that his son Donald J Trump Jr and his girlfriend Bettina Anderson are getting married, They just got engaged pic.twitter.com/8sRHXSqaRs
— Michelle (@Michelle_MAGA01) December 16, 2025
