Trump: ఇరాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు దక్కనివ్వను.. ట్రంప్ శపథం
- హార్ముజ్ రవాణా మార్గంపై ఒమన్‌తో ఇరాన్ ఒప్పందం
- ఒప్పందంపై స్పందించిన అధ్యక్షుడు ట్రంప్
- అణ్వాయుధాలు దక్కనివ్వనని ట్రంప్ శపథం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్ముజ్ జలసంధి రవాణా మార్గంపై ఒమన్‌తో ఒక ఒప్పందానికి వచ్చినట్లు టెహ్రాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని తేల్చి చెప్పారు.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం నిర్దేశించిన 60 రోజుల చర్చల గడువు ముగుస్తున్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గడువు పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. రెండు నెలల క్రితం చర్చలు ప్రారంభమైనప్పటికీ.. ఇరు దేశాల మధ్య కీలక అంశాలపై ఇంకా విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read
ఇంతలోనే ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగాఇరాన్ అణ్వాయుధంపై మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. ‘‘ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ రూపంలోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదనేదే ఎప్పటికీ మా ప్రధాన లక్ష్యం’’ అని పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా చూడటమే అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
మరోవైపు హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు సంబంధించిన మార్గాలపై ఒమన్‌తో ఒప్పందానికి వచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఉన్న ఈ కీలక జలమార్గం ద్వారా అంతర్జాతీయ వాణిజ్య నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. ట్రాన్సిట్ మార్గానికి సంబంధించిన మ్యాప్‌పై ఇరాన్, ఒమన్ మధ్య అవగాహన కుదిరిందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ సోమవారం తెలిపారు. అయితే తుది ఒప్పందాన్ని ఒక ప్యాకేజీ రూపంలో ఖరారు చేయాల్సి ఉందని చెప్పారు.
రాకపోకలు ఎలా?
ఇరాన్, ఒమన్ మధ్య కుదిరిన అవగాహనకు సంబంధించిన పూర్తి వివరాలను బఘాయీ వెల్లడించలేదు. అయితే గతంలో వెలువడిన వివరాల ప్రకారం.. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిస్తే నౌకలు ఇరాన్‌కు సమీపంలోని మార్గం ద్వారా ప్రవేశించి.. ఒమన్‌కు సమీపంలోని మార్గం ద్వారా బయటకు వెళ్లే విధానం ఉండొచ్చని తెలుస్తోంది. మధ్యంతర కాలంలో ఈ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి ఎలాంటి ఫీజులు లేదా టోల్లు వసూలు చేయకూడదనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం.
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై అమెరికా కూడా ఒక ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని కోరుతోంది. ఇరాన్ నౌకాశ్రయాలపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి ముందు హార్ముజ్ మార్గం తెరవడంపై స్పష్టమైన ఒప్పందం కుదరాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇరాన్-ఒమన్ మధ్య తాజాగా కుదిరిన అవగాహన అమెరికా అంచనాలకు సరిపోతుందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇదే సమయంలో ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంపై ట్రంప్ మరోసారి కఠిన వైఖరి ప్రకటించడం.. అమెరికా-ఇరాన్ చర్చల్లో కీలక అంశాలు ఇంకా పరిష్కారం కాలేదనే సంకేతాలను ఇస్తోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!