Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
- హార్ముజ్ జలసంధిపై ట్రంప్ సంచలన ప్రకటన
- శాశ్వతంగా టోల్ రహితంగా ఉంటుందని వెల్లడి
- ప్రపంచ దేశాలు హర్షాతీరేకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రాన్స్‌లో జీ 7 సదస్సు వేదికగా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హార్ముజ్ శాశ్వతంగా టోల్ రహితంగా ఉంటుందని వెల్లడించారు. సమ్మిట్‌ను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం చేశారు. ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి శుక్రవారం నాటికి పూర్తిగా తెరుచుకుంటుందని.. ఇకపై అది శాశ్వతంగా టోల్ ఫ్రీగా అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. అలాగే ఇరాన్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని.. దీనిపై ప్రత్యేకంగా మీడియా సమావేశం కూడా నిర్వహిస్తానని తెలిపారు.
ఇరాన్‌తో కుదిరిన ఈ ఒప్పందాన్ని అమెరికా కాంగ్రెస్ పరిశీలనకు పంపనున్నట్లు ట్రంప్ చెప్పారు. ఈ ఒప్పందంలో ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదని స్పష్టంగా పేర్కొన్నామని వెల్లడించారు. ఇరాన్‌తో చర్చల తొలి దశ విజయవంతంగా పూర్తైందని.. రెండో దశ చర్చలు మరింత వేగంగా పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!
- Nvidia Scandal: జెన్సన్ హువాంగ్-ఆలిస్లను కలిపింది ఆమె భర్తే.. ఎన్విడియా కేసులో ట్విస్ట్..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచకం.. హసీనా రాకముందే బాంబు దాడులు, ఆందోళనలు!
- North Korea: అమెరికా దెబ్బకు వణికిపోతున్న కిమ్.. 54 ఏళ్ల తర్వాత రాజ్యాంగం మార్చి సంచలన నిర్ణయం!
ఇరాన్ ఒప్పందానికి సంబంధించిన పూర్తి పాఠ్యాన్ని అధికారిక కార్యక్రమంలో విడుదల చేస్తానని వెల్లడించారు. అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఊరటనివ్వనుంది.
ఇదిలా ఉండగా.. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ కీలక ప్రకటన చేసింది. అమెరికాతో ఒప్పందం అనంతరం ఇరాన్‌కు చెందిన చమురు ట్యాంకర్లు, ఇతర వాణిజ్య నౌకలు మళ్లీ సముద్ర మార్గంలో ప్రయాణాలు ప్రారంభించాయని వెల్లడించింది. అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం సడలింపుకు ఇది సంకేతమని పేర్కొంది. ప్రస్తుతం మూడు ఇరానియన్ చమురు ట్యాంకర్లు ఉత్తర హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా.. మరో రెండు నౌకలు అవసరమైన సరుకులు, పశువుల మేతతో దక్షిణ ఇరాన్ నౌకాశ్రయాల వైపు వెళ్తున్నాయని ఇరాన్ మీడియా తెలిపింది.
ఏప్రిల్ 13 నుంచి అమల్లో ఉన్న అమెరికా నౌకాదళ ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే తాజా ఒప్పందంతో ఆ దిగ్బంధనాన్ని ఎత్తివేసే ప్రక్రియ అమలులోకి వచ్చిందని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
- Tags
- Donald Trump
- G7 France
- Hormuz
- Iran
- trump
తాజావార్తలు
-
Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!
-
UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!
-
Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
-
New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
-
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!