డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హార్వర్డ్ యూనివర్సిటీపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా విదేశీయులను చేర్చుకునే సర్టిఫికేషన్ కూడా ట్రంప్ పరిపాలన రద్దు చేసింది. దీంతో విదేశీ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
అయితే తాజాగా ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో కీలక చర్చ నడుస్తోంది. ట్రంప్ కుమారుడు బారన్‌కు హార్వర్డ్ యూనివర్సిటీ సీటు నిరాకరించడం వల్లే విశ్వవిద్యాలయంపై ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: MP: లిఫ్ట్‌లో ఇరుక్కున్న కొడుకు.. భయాందోళనతో తండ్రి మృతి
బారన్‌కు హార్వర్డ్, కొలంబియా, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలు సీటు నిరాకరించడంతో వేరే యూనివర్సిటీలో చేరాల్సి వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కుమార్తెకు మాత్రం హార్వర్డ్‌లో సీటు లభించిందని.. బారన్‌కు మాత్రం నిరాకరించడంతో ట్రంప్ ఈ కక్ష సాధింపులకు దిగుతున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. సోషల్ మీడియా ప్రచారంపై దేశ ప్రథమ మహిళ మెలానియా కార్యాలయం స్పందించింది. ఆన్‌లైన్ ప్రచారాన్ని ఖండించింది. బారన్.. అసలు హార్వర్డ్‌కు దరఖాస్తు చేయలేదని పేర్కొంది. కేవలం అవి ఊహాగానాలు మాత్రమేనని.. అతని తరపున కూడా ఎవరూ దరఖాస్తు చేసిన దాఖలాలు కూడా లేవని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: UP: పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత.. భార్యను ప్రియుడికి అప్పజెప్పిన భర్త..!
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రధానంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా పని చేసిందని.. అలాగే యూదు మతానికి వ్యతిరేకంగా.. హమాస్ మద్దతుగా పాఠాలు బోధిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో పాఠ్యాంశాలు మార్చాలని.. విదేశీ విద్యార్థుల విషయంలో విధి విధానాలు మార్చాలని ట్రంప్ సర్కార్ డిమాండ్ చేసింది. తాజాగా విదేశీయులను చేర్చుకునే సర్టిఫికేషన్ కూడా రద్దు చేసింది. దీంతో విశ్వవిద్యాలయం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
