US Strike on Iran: ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు జరిపినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. హోర్ముజ్ జలసంధిలోని ఇరాన్ కేశ్మ్ ద్వీపంపై పరిమిత స్థాయిలో దాడి చేసినట్లు వెల్లడించారు. ఇరాన్ కొత్తగా నిర్మించిన వైమానిక రక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులు పరిమితమైనవని, రక్షణాత్మక చర్యల్లో భాగంగా చేపట్టినట్లు అమెరికా చెబుతోంది.
మంగళవారం ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ దాడి విషయాన్ని వెల్లడించారు . ఇరాన్ ఒక యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ కేంద్రాన్ని నిర్మించిందని, అది పూర్తయిన వెంటనే గత రాత్రి అమెరికా దానిపై సమర్థవంతంగా దాడి చేసిందని చెప్పారు. అంతకుముందు, కేశ్మ్ ద్వీపంపై అమెరికా దాడులు చేసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. హార్ముజ్‌లో వాణిజ్య నౌకలపై దాడులు చేసే స్వేచ్ఛ ఇరాన్‌కు లేకుండా చేయడమే ఈ దాడుల లక్ష్యమని అమెరికా అధికారులు చెబుతున్నారు.

