US-India: టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్‌లో నూతన రాయబారి నియామకం
- టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం
- భారత్‌లో నూతన రాయబారి నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌కు నూతన రాయబారిగా సెర్గియో గోర్‌ను నియమించారు. తన సన్నిహితుడు, రాజకీయ సహాయకుడు సెర్గియో గోర్(38)ను భారత రాయబారిగా నియమించినట్లు సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు. విదేశాంగ విధానంలో సెర్గియో గోర్ అనుభవం కలిగిన వ్యక్తి అని.. రాయబారిగా అద్భుతంగా పని చేస్తారని ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ట్రంప్ కితాబు ఇచ్చారు. సెర్గియో గోర్ దక్షిణ-మధ్య ఆసియాకు ప్రత్యేక రాయబారి పాత్రను నిర్వహిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US: న్యూయార్క్‌లో బస్సు బోల్తా.. ఐదుగురు మృతి.. భారతీయులుగా అనుమానం!
Also Read
- Pete Hegseth: ఇరాన్‌పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
- Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
- Lashkar-e-Taiba: భారత్‌ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
- USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య సుంకాల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్‌పై 50 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ సన్నిహితుడైన సెర్గియో గోర్‌ను భారత రాయబారిగా ట్రంప్ నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరిగి ఇరు దేశాల మధ్య సంబంధాలను బలపరుస్తారా? లేదంటే ఆజ్యం పోస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే దంపతులు టీడీపీని బెదిరిస్తున్నారా..?
సెర్గియో గోర్.. ట్రంప్‌కు అత్యంత విధేయుడు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌కు అత్యంత నమ్మకస్థుడు. ఇక గోర్‌కు కూడా ఎలాన్ మస్క్ కూడా శత్రువే. ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేవు. ఎలాన్ మస్క్‌ను పాము లాంటివాడని ముద్ర వేశాడు. ఇక దౌత్యవేత్తల నియామకంలో ఎక్కువగా సన్నిహితులకే ట్రంప్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అందులో భాగంగానే గోర్‌ను భారత రాయబారిగా నియమించారు. ఇక విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. గోర్ నియామకాన్ని సమర్థించారు. అతి ముఖ్యమైన సంబంధాల్లో ఒకదానికి అద్భుతమైన ప్రతినిధిగా ఉంటారని తెలిపారు.

తాజావార్తలు
-
Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్‌తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
-
Pete Hegseth: ఇరాన్‌పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
-
Delhi Building Collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
-
Mamata Banerjee: అభిషేక్‌పై దాడి.. మమతకు అండగా ఖర్గే, అఖిలేష్ యాదవ్..
-
Ajay Bhupathi: “శ్రీనివాస మంగాపురం” ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..