ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ వర్సెస్ మీడియా యుద్ధం సాగుతోంది. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను వైట్‌హౌస్‌కు రాకుండా బహిష్కరించారు. తాజాగా ఐక్యరాజ్యసమితిలో ప్రసగించేందుకు వెళ్లగా.. అక్కడ బహిష్కరణకు గురైన ఓ రిపోర్టర్ ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆ మీడియా ప్రతినిధిపై ట్రంప్ రుసరుసలాడారు. ‘‘మీరు ఇక్కడ ఉండకూడదు.. నా వార్తలను సేకరించకూడదు’’ అని వ్యాఖ్యానించారు.
ఇరాన్ యుద్ధంపై CNN రిపోర్టర్ కైట్లాన్ కొలిన్స్ ప్రశ్నించారు. దీంతో రిపోర్టర్‌పై ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తూ.. ‘‘మీరు ఇక్కడ ఉండకూడదు.. నన్ను కవర్ చేయకూడదు’’ అంటూ వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి ట్రంప్ చేరుకున్న సమయంలో CNN ప్రతినిధి కైట్లాన్ కొలిన్స్ ప్రశ్నించారు. ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధిస్తోందని దేశంలోని మూడింట రెండొంతుల మంది ప్రజలు భావించడం లేదని చెబుతూ.. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని ఆమె ప్రశ్నించారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ.. ‘‘మీరు నన్ను కవర్ చేయడానికి ఇక్కడ ఉండకూడదు. మీరు నన్ను కవర్ చేయబోమని చెప్పారు. మీరు నన్ను కవర్ చేయకూడదు’’ అని అన్నారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మీడియా సంస్థలతో వైట్‌హౌస్ వివాదం..
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో వైట్‌హౌస్, పలు మీడియా సంస్థల మధ్య కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. CNN, MSNBC, Politico సంస్థలు తమకు అధ్యక్ష కార్యక్రమాల్లో యాక్సెస్‌పై విధించిన పరిమితులు అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్‌మెంట్ హక్కులకు విరుద్ధమని ఆరోపిస్తూ ట్రంప్ ప్రభుత్వంపై న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు CNN పేర్కొంది. ఈ వివాదం వైట్‌హౌస్ టెలివిజన్ పూల్‌పైనా ప్రభావం చూపింది. అధ్యక్షుడి కార్యక్రమాలకు సంబంధించిన వీడియో కవరేజీని సాధారణంగా CNN, CBS, NBC, Fox News, ABC సంస్థలు రొటేషన్ పద్ధతిలో అందిస్తుంటాయి.
CNN స్థానంలో మరో ఛానల్ ఉంటుందా?
వైట్‌హౌస్ కార్యక్రమాల కవరేజీ నుంచి CNNను తప్పించడంతో.. దాని స్థానంలో మరో బ్రాడ్‌కాస్టర్‌ను నియమిస్తారా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే సోమవారం వైట్‌హౌస్ పూల్ సబ్‌స్క్రైబర్లకు పంపిన సందేశంలో Fox News పూల్ డైరెక్టర్ బ్రయాన్ బౌటన్.. CNN స్థానంలో మరో టీవీ పూల్‌ను నియమించబోమని తెలిపారు. ‘‘ఈ రోజు నుంచి అధ్యక్షుడికి సంబంధించిన పూల్ కవరేజీగా గుర్తించిన కార్యక్రమాలను టీవీ పూల్ కవర్ చేయదు’’ అని ఆయన పేర్కొన్నట్లు CNN తెలిపింది. CNN తనకు కేటాయించిన పూల్ విధులను నిర్వహించకుండా వైట్‌హౌస్ తీసుకున్న నిర్ణయం కారణంగానే ఈ మార్పు జరిగినట్లు బౌటన్ వివరించారు. అయితే కాంగ్రెస్ కార్యక్రమాలు, వీఐపీల కార్యక్రమాలు, వాషింగ్టన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగే ఎంపిక చేసిన కార్యక్రమాలకు సంబంధించిన ఇతర పూల్ కవరేజీ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
Trump to CNN while entering UNGA:
I’m surprised CNN is here covering me. You shouldn’t be here.
You said you weren’t going to cover me. You shouldn’t be covering me. https://t.co/NEMt8m9ywm
— Clash Report (@clashreport) September 22, 2026

