FIFA ఫైనల్లో ట్రంప్‌కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
- స్పెయిన్ విజయోత్సవంలో ట్రంప్ ఓవర్ యాక్షన్?
- సంబరాల మధ్య ట్రంప్‌ను స్టేజ్ నుంచి పక్కకు జరిపిన FIFA చీఫ్!
- ప్రపంచం చూస్తుండగానే ట్రంప్‌కు షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA: ఫిఫా పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కేవలం స్పెయిన్ విజయం వల్లే కాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురైన చేదు అనుభవం కారణంగా కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవంలో ట్రంప్‌కు ప్రేక్షకుల నుంచి హూటింగ్ ఎదురవడం, అనంతరం FIFA అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ఆయనను స్టేజ్‌పై పక్కకు జరపడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పెయిన్ ఫైనల్లో అర్జెంటీనాపై విజయం సాధించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ట్రోఫీ ప్రదానోత్సవం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, FIFA అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో మైదానంలోకి అడుగుపెట్టగానే స్టేడియంలో ఉన్న కొందరు అభిమానులు పెద్ద ఎత్తున హూటింగ్ చేశారు. అయితే ఆటగాళ్లకు పతకాలు అందజేసే కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఆ హూటింగ్ క్రమంగా తగ్గిపోయింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక హెలికాప్టర్లో స్టేడియానికి చేరుకుని ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించారు. ట్రోఫీ అందజేసిన అనంతరం కూడా ఆయన స్పెయిన్ ఆటగాళ్లతో కలిసి వేదికపై నిలిచారు. అయితే స్పెయిన్ కెప్టెన్ రోడ్రీ ప్రపంచకప్ ట్రోఫీని ఎత్తి అభిమానులకు చూపించే సమయంలో FIFA అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ట్రంప్‌ను వేదికపై ఒకవైపుకు జరిపిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనకు ముందు నుంచే ట్రంప్ ఫుట్‌బాల్ ప్రపంచంలో వివాదానికి కేంద్రబిందువయ్యారు. గ్రూప్ దశలో అమెరికా–బోస్నియా అండ్ హెర్జెగోవినా మ్యాచ్ సందర్భంగా అమెరికా స్ట్రైకర్ ఫోలారిన్ బాలోగన్‌కు రెడ్ కార్డ్ చూపించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని FIFA అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోకు నేరుగా ఫోన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక దేశాధినేత ఆట నిబంధనలు, రిఫరీ నిర్ణయాల్లో నేరుగా జోక్యం చేసుకోవాలని ప్రయత్నించడం సరికాదంటూ ప్రపంచవ్యాప్తంగా పలువురు ఫుట్‌బాల్ నిపుణులు, అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. అదే వివాదం ప్రభావం ఫైనల్ ట్రోఫీ ప్రదానోత్సవంలోనూ కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్‌కు ఎదురైన హూటింగ్, స్టేజ్‌పై జరిగిన పరిణామాలు ప్రస్తుతం అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
President Donald J. Trump presents the World Cup Trophy to Spain, the 2026 @FIFAWorldCup Champions! 🏆 pic.twitter.com/SHsoBhYm1b
— The White House (@WhiteHouse) July 19, 2026
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..