NTV Telugu Site icon

Iran-US: ఇరాన్-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. ఇరుపక్షాలు వైమానిక దాడులకు రెడీ

Iranus

Iranus

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణంలోనైనా ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులకు దిగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాతో అణు ఒప్పందంతో చేసుకోకపోతే.. తీవ్రమైన బాంబు దాడులు జరగొచ్చని ఆదివారం ట్రంప్.. ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌పై దాడులు జరగొచ్చని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా వైమానిక దాడులను ప్రతిఘటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అమెరికాతో సంబంధాలు ఉన్న మిత్ర దేశాల స్థావరాలను ఢీకొట్టేందుకు ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఇరాన్ సిద్ధం చేసింది.

ఇది కూడా చదవండి: Trump: మూడోసారి అధ్యక్షుడ్ని ఎందుకు కాకూడదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ సొంతంగా అణు సామర్థ్యాన్ని పెంపొందించుకుంటుంది. దీన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాషింగ్టన్‌తోనే ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. అందుకు ఇరాన్ ససేమిరా అంటోంది. ట్రంప్ రాసిన లేఖను పక్కన పెట్టింది. అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరపబోమని తేల్చి చెప్పింది. పరోక్ష చర్చలకు మాత్రం సిద్ధమేనని పేర్కొంది. ఇదే ట్రంప్‌నకు రుచించలేదు. కోపం తెప్పించింది. ఒప్పందం చేసుకోకపోతే.. అధిక స్థాయిలో సుంకాలు విధిస్తామని.. అంతేకాకుండా భీకరమైన బాంబు దాడులు చేస్తామని ఆదివారం హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Kodali Nani: గచ్చిబౌలి ఏఐజీ నుంచి మాజీ మంత్రి కొడాలి నాని డిశ్చార్జ్