Site icon NTV Telugu

Trump Video: ఆమె అందం చూసే అతడికి పదవి ఇచ్చా.. ట్రంప్ హాట్ కామెంట్స్

Trump5

Trump5

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్ చేశారు. ‘‘నువ్వు అందంగా ఉన్నావు.. అందుకే నీ భర్తను నియమించుకున్నాను.’’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే..

అమెరికా అంతర్గత కార్యదర్శిగా డగ్ బెర్గర్‌ను నియమించినట్లుగా ట్రంప్ తెలిపారు. మాదకద్రవ్యాల కట్టడి ఉత్తర్వుపై సంతకం చేస్తూ ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. డగ్ బెర్గర్ భార్య కేథరీన్ చాలా అందంగా ఉంటుందని.. భర్తతో కలిసి గుర్రపు స్వారీ చేస్తుండగా ఒక వీడియోలో చూశానని చెప్పారు. కేథరీన్ అందాన్ని చూసి ముగ్ధుడినై.. ఆమె భర్త డగ్ బెర్గర్‌‌ను అమెరికా అంతర్గత కార్యదర్శిగా నియమించినట్లు పేర్కొన్నారు. కేథరీన్ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను చూసినప్పుడు.. ఆమె ఎవరు? అంటూ సహాయకుల ద్వారా ఆరా తీసినట్లు చెప్పారు. ఆ సమయంలోనే ఆమె భర్తను నియమించుకోవాలని డిసైడ్ అయినట్లు వెల్లడించారు. భార్యాభర్తలు పక్కన ఉండగానే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక కేథరీన్ జంట అద్భుతం అంటూ ట్రంప్ ప్రశంసించారు. డగ్ బెర్గర్ పని తీరును కూడా కొనియాడారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా.. ఉత్తర డకోటాకు రెండు సార్లు గవర్నర్‌గా పని చేశారని.. అతడికి కేథరీన్ కూడా చాలా బాగా సహకరించిందని పేర్కొన్నారు. ఇక ట్రంప్ వ్యాఖ్యలపై కొందరు విమర్శిస్తుండగా.. మరికొందరు తప్పేముందంటూ మద్దతుదారులు వెనకేసుకొస్తున్నారు.

 

Exit mobile version