Site icon NTV Telugu

Trump: ట్రంప్-మెలానియా మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రథమ మహిళ మెలానియా మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా చర్చించుకుంటున్నారు.

సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు భార్య మెలానియాతో కలిసి ట్రంప్ వెళ్లారు. అయితే ఎస్కలేటర్ ఎక్కగానే సడన్‌గా ఆగిపోయింది. దీంతో ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. అనంతరం టెలిప్రాంప్టర్ ఆగిపోయింది. అలాగే ట్రంప్ మాట్లాడుతుండగా వాయిస్ కూడా సరిగ్గా వినిపించలేదు. దీంతో తనకు అవమానం జరిగిందంటూ ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై విచారణకు కూడా ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

అనంతరం ట్రంప్, మెలానియా వైట్‌హౌస్‌కు తిరిగి వెళ్లే క్రమంలో మెరైన్ వన్‌ హెలికాప్టర్‌లో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య యూఎన్‌లో జరిగిన సంఘటనలపై ఘర్షణ జరిగినట్లుగా సమాచారం. మెలానియాకు ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపించింది. మెలానియా వైపు వేలు చూపిస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. అంతేకాకుండా మెలానియా కాలును కూడా తన్నినట్లుగా తెలుస్తోంది. యూఎన్‌లో జరిగిన ఘటనపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: UP: ‘ఐ లవ్ ముహమ్మద్’ నిరసనలపై ఉక్కుపాదం.. యూపీ మతాధికారి అరెస్ట్

గతంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ కూడా ఫ్లైట్ దిగుతుండగా భార్యతో గొడవ జరిగింది. మాక్రాన్‌ను ఆయన భార్య తోసేసింది. ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది.

 

 

 

Exit mobile version