అమెరికా ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. అయితే సంప్రదాయబద్ధంగా నూతనంగా ఎన్నికైన ట్రంప్‌తో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయ్యారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ట్రంప్ జయకేతనం ఎగరవేశారు. భేటీ సందర్భంగా అధికార మార్పిడి సజావుగా సాగేందుకు సహకరించుకోవాలని ఇరువురు నిర్ణయించుకున్నారు.
అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత.. గెలిచిన వారితో అధ్యక్షుడు భేటీ కావడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే 2020లో ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్.. విజయం సాధించిన జో బైడెన్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించలేదు. అంతేకాకుండా బైడెన్ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికీ హాజరుకాలేదు. బైడెన్ మాత్రం మునుపటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ట్రంప్‌నకు ఆహ్వానం పంపారు.