Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ఏఐ దూకుడికి కళ్లెం వేయాలన్న ఆంత్రోపిక్ సీఈఓ
- ఆంత్రోపిక్ సీఈఓ ప్రకటనను తిప్పికొట్టిన ట్రంప్
- బలమైన, తెలివైన అధ్యక్షుడు భయమక్కర్లేదని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐ దూకుడికి కళ్లెం వేయాలని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలను అధ్యక్షుడు ట్రంప్ తిప్పికొట్టారు. ఏఐ వేగాన్ని తగ్గిస్తే టెక్నాలజీ పోటీలో చైనాకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఏఐకి మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆంత్రోపిక్ సీఈవో డారియో వాదనను తోసిపుచ్చుతూ.. ఈ సాంకేతికతకు అవసరమైన ఏకైక రక్షణ అందించేది కేవలం బలమైన, తెలివైన అధ్యక్షుడు మాత్రమే అందిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.
“ఏఐకి అవసరమైన ఏకైక నియంత్రణ లేదా ‘గార్డ్‌రైల్స్’ బలమైన, తెలివైన (హై ఐక్యూ!) అధ్యక్షుడు. అమెరికాకు అది పుష్కలంగా ఉంది!” అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఏఐ, డేటా సెంటర్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని “అనారోగ్యకరమైన కుట్ర”గా అభివర్ణించారు. ఏఐ అభివృద్ధిని నెమ్మదింపజేసే ప్రయత్నాలు చైనాకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని అన్నారు. “ఎవరైతే ఏఐని గెలుచుకుంటారో.. వాళ్లే గెలుస్తారు!” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రస్తుతం చైనాతో పాటు ఇతర దేశాల కంటే ముందంజలో ఉందని.. ఈ ఆధిపత్యాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
Also Read
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
- Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
ట్రంప్ విమర్శలు
ఏఐ అభివృద్ధిపై నియంత్రణలు, జాగ్రత్తలు అవసరమన్న వాదన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు వచ్చాయి. ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ.. ఏఐతో ఎదురయ్యే ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కంపెనీలు ఏఐ అభివృద్ధిని కొంత నెమ్మదించాలని ఇటీవల పిలుపునిచ్చారు. తాజాగా దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఏఐ కంపెనీలు “చెడు లేదా సంభావ్యంగా చెడు” పనులు చేయకుండా తన ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని అన్నారు. ఏఐ సంస్థలపై క్రిమినల్, నియంత్రణపరమైన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి విస్తృతంగా ఉందని పేర్కొన్నారు. అమోడీని ఉద్దేశించి ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తాను “పరిపూర్ణమైన చిన్న దేవదూతలా నటిస్తున్న వ్యక్తి” అని అమోడీని అభివర్ణించారు. ఏదైనా సంస్థ తప్పుగా వ్యవహరిస్తోందని భావిస్తే తమ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కొనసాగిస్తుందని తెలిపారు.
నియంత్రణలు అవసరమా?
ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందాలి? దాని వల్ల తలెత్తే ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఎలాంటి భద్రతా చర్యలు ఉండాలి? అనే అంశాలపై టెక్నాలజీ రంగ నిపుణులు, ప్రభుత్వాలు, విధాన నిర్ణేతల మధ్య చర్చ కొనసాగుతోంది. ఏఐ అభివృద్ధిని కొంత నెమ్మదించాలని అమోడీ కోరుతుండగా.. టెక్నాలజీ రంగంలోని పలువురు ప్రముఖులు కూడా ఏఐ భద్రత, చట్టపరమైన బాధ్యత, జాతీయ భద్రతకు సంబంధించి మరింత కఠినమైన చర్యలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. మరింత శక్తిమంతమైన ఏఐ వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్న కొద్దీ వాటి దుర్వినియోగం, సైబర్ భద్రత, దీర్ఘకాలిక ప్రమాదాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
పోటీని ప్రస్తావించిన ట్రంప్
ఏఐపై అదనపు నియంత్రణలు అమెరికా టెక్నాలజీ రంగం వేగాన్ని తగ్గించవచ్చన్న అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. ఏఐ అభివృద్ధిని అడ్డుకోవడం వల్ల అమెరికా వెనుకబడే అవకాశం ఉందని, అదే సమయంలో చైనాకు ప్రయోజనం కలుగుతుందని వాదించారు. ప్రపంచంలో సాంకేతిక ఆధిపత్యం కోసం అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న పోటీలో ఏఐ కీలకంగా మారిందని ట్రంప్ పేర్కొన్నారు. “ఏఐ రేసులో ఎవరు గెలిస్తే.. వారిదే ఆధిపత్యం” అనే తన వైఖరిని మరోసారి స్పష్టం చేస్తూ, ఏఐలో అమెరికా ఆధిక్యాన్ని కొనసాగించడమే తమ లక్ష్యమని ట్రంప్ సంకేతాలిచ్చారు.

- Tags
- AI
- Donald Trump
- trump
తాజావార్తలు
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!