Site icon NTV Telugu

Trump: భారత్-పాక్ సమస్యను నేనే పరిష్కరించా.. ట్రంప్ మళ్లీ ప్రకటన

Trump2

Trump2

భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను తానే పరిష్కరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో  ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తాను పరిష్కరించినట్లు చెప్పుకొచ్చారు. మరోసారి క్రిడిట్ కొట్టే ప్రయత్నం చేశారు. వాణిజ్యం ద్వారా సమస్యను పరిష్కరించినట్లు చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Amrit Railway Stations: ప్రధానమంత్రి చేతుల మీదుగా దేశవ్యాప్తంగా 103 ‘అమృత్’ రైల్వే స్టేషన్ల ప్రారంభం..!

ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని ట్రంప్ గుర్తుచేశారు. దీనికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కలుగజేసుకుని తాము కూడా పరస్పర స్నేహితులం అని సమాధానం ఇచ్చాడు. ఇంతలో ట్రంప్ జోక్యం పుచ్చుకుని.. మోడీ గొప్ప వ్యక్తి అని.. ఇది మంచి విషయం అన్నారు. తమకు తాముగానే సమస్యను పరిష్కరించుకున్నామని ఇరుదేశాలు చెబితే తాను ఇష్టపడనన్నారు. తమ జోక్యంతోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయన్నారు.

ఇది కూడా చదవండి: Atchutapuram: పోలీసుల తనిఖీలు.. భారీ “సైబర్ డెన్” గుర్తింపు..!

అయితే వాణిజ్య దౌత్యం ద్వారా భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను తగ్గించామన్న ట్రంప్ ప్రకటనను భారత్ ఖండించింది. ఇందులో ఇతర దేశాల ప్రమేయం లేదని భారత్ తెలిపింది.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగి 26 మంది చనిపోయారు. అనంతరం భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశారు. అనంతరం మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. అయితే ఈ క్రెడిట్.. ట్రంప్ కొట్టేసే ప్రయత్నం చేశారు. దీన్ని భారత్ ఖండిస్తోంది.

 

Exit mobile version